నిర్మాతగా ప్రభాస్‌ అభిమాని

ABN , Publish Date - Jul 09 , 2024 | 02:00 AM

రవి సిరోర్‌, నివిష్క పాటిల్‌ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఎవరు.. ఎందుకు?’ షూటింగ్‌ పూర్తయింది. ఎస్‌.జి.ఆర్‌. దర్శకత్వంలో జి.వెంకటేశ్‌ రెడ్డి నిర్మించారు...

రవి సిరోర్‌, నివిష్క పాటిల్‌ జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఎవరు.. ఎందుకు?’ షూటింగ్‌ పూర్తయింది. ఎస్‌.జి.ఆర్‌. దర్శకత్వంలో జి.వెంకటేశ్‌ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ ను సీనియర్‌ నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి ఆవిష్కరించారు. లిరికల్‌ వీడియోను తెలుగు నిర్మాతలమండలి కార్యదర్శి ప్రసన్నకుమార్‌ విడుదల చేశారు. ఈ సందర్బంగా శ్యామలాదేవి మాట్లాడుతూ ‘వెంకటరెడ్డి హిందుపూర్‌ ప్రభాస్‌ ఫ్యాన్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌. ఆయన మా ఫ్యామిలీ మొత్తానికీ అభిమాని’ అన్నారు. ‘మా ఆరాధ్యదైవం కృష్ణంరాజుగారి సతీమణి చేతుల మీదుగా ఫస్ట్‌ లుక్‌ విడుదల కావడం ఆనందంగా ఉంది ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌’ అన్నారు.

Updated Date - Jul 09 , 2024 | 02:00 AM