నాలుగేళ్ల కల

ABN , Publish Date - May 09 , 2024 | 06:26 AM

జీవన్‌ రెడ్డి, అలేఖ్య జంటగా అశ్విన్‌ కామరాజ్‌ కొప్పాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వృషభ’. మురళీకృష్ణా రెడ్డి, గడ్డం నవీన్‌,రాజమౌళి తదితరులు...

నాలుగేళ్ల కల

జీవన్‌ రెడ్డి, అలేఖ్య జంటగా అశ్విన్‌ కామరాజ్‌ కొప్పాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వృషభ’. మురళీకృష్ణా రెడ్డి, గడ్డం నవీన్‌,రాజమౌళి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఉమా శంకర్‌ నిర్మాత. ఈ సినిమా లిరికల్‌ సాంగ్‌, ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఉమాశంకర్‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘నాలుగేళ్ల కల ఈ సినిమా. ఎక్కడా రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మించాను. టీమ్‌ అంతా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు’’ అని చెప్పారు. చిత్ర దర్శకుడు అశ్విన్‌ కామరాజ్‌ మాట్లాడుతూ ‘‘ఉమా శంకర్‌ అద్భుతమైన కథ రాసుకొచ్చి నన్ను అప్రోచ్‌ అయ్యారు. ఈ కాన్సెప్ట్‌ మీద చాలా హార్డ్‌వర్క్‌ చేశాం’’ అని అన్నారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: మహేంద్ర నాథ్‌, డీఓపీ: యుఎస్‌ విజయ్‌, సంగీతం: ఎమ్‌.ఎల్‌.రాజా, కో ప్రొడ్యూసర్‌: మల్లికా రెడ్డి.

Updated Date - May 09 , 2024 | 06:26 AM