విభిన్నమైన ప్రేమకథ
ABN , Publish Date - Oct 27 , 2024 | 05:42 AM
షెరాజ్ మెహదీ లీడ్ రోల్‌లో నటిస్తూ.. స్వీయ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఓ అందాల రాక్షసి’. విహాన్షీ హెగ్దే, కృతి వర్మ హీరోయిన్లు. సురీందర్ కౌర్ నిర్మిస్తున్న ఈ ప్రేమ కథా చిత్రం ప్రస్తుతం...
షెరాజ్ మెహదీ లీడ్ రోల్‌లో నటిస్తూ.. స్వీయ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఓ అందాల రాక్షసి’. విహాన్షీ హెగ్దే, కృతి వర్మ హీరోయిన్లు. సురీందర్ కౌర్ నిర్మిస్తున్న ఈ ప్రేమ కథా చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. త్వరలోనే సినిమా విడుదలువుతున్న సందర్భంగా హీరో, దర్శకుడు షెరాజ్ మెహదీ మాట్లాడుతూ ‘‘మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. విభిన్నమైన ప్రేమకథగా రాబోతోంది’’ అని చెప్పారు. ‘‘ఇందులో నేను పోషించిన పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి. కమర్షియల్ అంశాలతో పాటు ఆలోచింపజేసే సందేశం ఉన్న సినిమా ఇది’’ అని హీరోయిన్ విహాన్షీ హెగ్దే అన్నారు.