డివోషనల్‌ థ్రిల్లర్‌

ABN , Publish Date - Jun 26 , 2024 | 05:48 AM

ఆది సాయికుమార్‌, ఆవికా గోర్‌ జంటగా రూపుదిద్దుకుంటున్న డివోషనల్‌ థ్రిల్లర్‌ ‘షణ్ముఖ’. ఈ చిత్రానికి షణ్ముగం సాప్పని దర్శకుడు. ఇంతకుముందు ‘శాసనసభ’ చిత్రాన్ని నిర్మించిన...

డివోషనల్‌ థ్రిల్లర్‌

ఆది సాయికుమార్‌, ఆవికా గోర్‌ జంటగా రూపుదిద్దుకుంటున్న డివోషనల్‌ థ్రిల్లర్‌ ‘షణ్ముఖ’. ఈ చిత్రానికి షణ్ముగం సాప్పని దర్శకుడు. ఇంతకుముందు ‘శాసనసభ’ చిత్రాన్ని నిర్మించిన తులసీరామ్‌ సాప్పని, షణ్ముగం సప్పని, రమేశ్‌ యాదవ్‌ ఈ సినిమాకు నిర్మాతలు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇప్పటివరకూ ఎవరూ టచ్‌ చేయని ఓ అద్భుతమైన పాయింట్‌తో రూపుదిద్దుకుంటున్న డివోషనల్‌ థ్రిల్లర్‌ ఇది. అద్భుతమైన గ్రాఫిక్స్‌తో విజువల్‌ వండర్‌గా ఉంటుంది. ఇటీవల హైదరాబాద్‌లో నిర్మించిన భారీ సెట్‌లో చివరి షెడ్యూల్‌ పూర్తయింది. రవి బస్రూర్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. హీరో ఆది కెరీర్‌లో ఓ మైలు రాయిగా నిలిచిపోతుంది’ అని చెప్పారు.

Updated Date - Jun 26 , 2024 | 05:48 AM