ఇళయరాజా భక్తుడిని

ABN , Publish Date - Mar 21 , 2024 | 05:49 AM

‘ఇసైజ్ఞాని’ ఇళయరాజాకు తను పరమభక్తుడనని తమిళ హీరో ధనుష్‌ అన్నారు. ఇళయరాజా జీవిత చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకుంటున్న చిత్రంలో ఆయన హీరో. అరుణ్‌ మాధేశ్వరన్‌ దర్శకుడు...

ఇళయరాజా భక్తుడిని

‘ఇసైజ్ఞాని’ ఇళయరాజాకు తను పరమభక్తుడనని తమిళ హీరో ధనుష్‌ అన్నారు. ఇళయరాజా జీవిత చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకుంటున్న చిత్రంలో ఆయన హీరో. అరుణ్‌ మాధేశ్వరన్‌ దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్‌ బుధవారం చెన్నైలో మొదలైంది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపుదిద్దుకోనుంది. ఈ కార్యక్రమంలో విశ్వనటుడు కమల్‌హాసన్‌ పాల్గొని మూవీ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఈ చిత్రం కేవలం ఐదు భాషల్లోనే కాకుండా, భారతదేశంలోని భాషలన్నింటిలో విడుదలకావాలి. ఇది ఇళయరాజా స్టోరీ కాదు.. ‘భారతరత్న’ జీవిత కథ’. ఈ పాత్రకు ధనుష్‌ న్యాయం చేస్తారని భావిస్తున్నా’ అని పేర్కొన్నారు. చిత్ర కథానాయకుడు ధనుష్‌ మాట్లాడుతూ ‘చిత్రపరిశ్రమలో సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌, ఇళయరాజా అంటే నాకు అమితమైన అభిమానం. వాళ్ళిద్దరి బయోపిక్స్‌లో నటించాలన్నది నా లక్ష్యం. వాటిల్లో ఒకటి నెరవేరింది. ఇళయరాజాకు నేనొక భక్తుడిని. నటనలో ఆయన సంగీతమే నాకు గురువు.’ అన్నారు. ఈ సినిమాను కనెక్ట్‌ మీడియా, పీకే ప్రైమ్‌ ప్రొడక్షన్‌, మెర్క్యూరి మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

చెన్నై (ఆంధ్రజ్యోతి)

Updated Date - Mar 21 , 2024 | 05:49 AM