కల్ట్‌ లవ్‌స్టోరీ

ABN , Publish Date - Apr 04 , 2024 | 02:08 AM

దర్శకుడు నక్కిన త్రినాథరావు తన సొంత చిత్రనిర్మాణ సంస్థ నక్కిన నేరేటివ్స్‌లో నిర్మించే రెండో సినిమా షూటింగ్‌ బుధవారం ప్రారంభమైంది. పలు సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించిన విక్రమ్‌ సహిదేవ్‌ లగడపాటి హీరోగా...

కల్ట్‌ లవ్‌స్టోరీ

దర్శకుడు నక్కిన త్రినాథరావు తన సొంత చిత్రనిర్మాణ సంస్థ నక్కిన నేరేటివ్స్‌లో నిర్మించే రెండో సినిమా షూటింగ్‌ బుధవారం ప్రారంభమైంది. పలు సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించిన విక్రమ్‌ సహిదేవ్‌ లగడపాటి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ‘దృశ్యం’ చిత్రంలో వెంకటేశ్‌ కుమార్తెగా నటించిన ఎస్తేర్‌ అనిల్‌ హీరోయిన్‌గా చేస్తున్నారు. వీరిద్దరిపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు నిర్మాత శరత్‌ మరార్‌ కెమెరా స్విచాన్‌ చేయగా, హీరో సందీప్‌కిషన్‌ క్లాప్‌ ఇచ్చారు. సుమంత్‌ తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా త్రినాథరావు మాట్లాడుతూ ‘ఇది కల్ట్‌ లవ్‌ స్టోరీ. టౌన్‌లో జరిగే అందమైన ప్రేమకథ. ఇందులో విక్రమ్‌ పాత్ర అదిరిపోతుంది. ఎస్తేర్‌ లో మంచి ప్రతిభ ఉంది. తారక్‌ పొన్నప్ప కీలక పాత్ర పోషిస్తున్నారు’ అని చెప్పారు. ‘రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెలలోనే ప్రారంభిస్తాం. అనకాపల్లి, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ జరుగుతుంది. ఎవరూ ఊహించని జానర్‌లో ఈ సినిమా ఉంటుంది’ అని దర్శకుడు వంశీకృష్ణ మల్ల చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: నరేశ్‌ తుల, రాజేంద్రప్రసాద్‌, సంగీతం: దావ్‌జాంద్‌, ఫొటోగ్రఫీ: మాయ వి, సహ నిర్మాత: ఎన్‌.వి.ఎస్‌.ఎస్‌. సురేశ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సీతారామరాజు మల్లెల.

Updated Date - Apr 04 , 2024 | 02:08 AM