క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌

ABN , Publish Date - May 21 , 2024 | 06:10 AM

దీక్షిత్‌ శెట్టి హీరోగా నటిస్తున్న క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ ‘బ్యాంక్‌ ఆఫ్‌ భాగ్యలక్ష్మి’. తెలుగు, కన్నడ భాషల్లో రూపుదిద్దుకొనే ఈ చిత్రానికి అభిషేక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బృందా ఆచార్య కథానాయిక...

క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌

దీక్షిత్‌ శెట్టి హీరోగా నటిస్తున్న క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ ‘బ్యాంక్‌ ఆఫ్‌ భాగ్యలక్ష్మి’. తెలుగు, కన్నడ భాషల్లో రూపుదిద్దుకొనే ఈ చిత్రానికి అభిషేక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బృందా ఆచార్య కథానాయిక. హెచ్‌.కె. ప్రకాశ్‌ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో దీక్షిత్‌ శెట్టి గన్‌తో షూట్‌ చేస్తూ, కాలికి టైగర్‌ మాస్క్‌ పెట్టుకుని కనిపించారు. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: జుధాన్‌ శ్యాండీ, ఫొటోగ్రఫీ: అభిషేక్‌ జే, ఎడిటింగ్‌: తేజస్‌ ఆర్‌.

Updated Date - May 21 , 2024 | 06:10 AM