ఒక్కటి చేసిన క్రికెట్‌ కల

ABN , Publish Date - May 13 , 2024 | 12:08 AM

రాజ్‌కుమార్‌ రావు, జాన్వీకపూర్‌ జంటగా నటించిన క్రీడా నేపథ్య చిత్రం ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’. ఈ నెల 31న ఈ విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం యూనిట్‌ ట్రైలర్‌ను...

ఒక్కటి చేసిన క్రికెట్‌ కల

రాజ్‌కుమార్‌ రావు, జాన్వీకపూర్‌ జంటగా నటించిన క్రీడా నేపథ్య చిత్రం ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’. ఈ నెల 31న ఈ విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం యూనిట్‌ ట్రైలర్‌ను విడుదల చేసింది. హీరో హీరోయిన్ల పెళ్లి ప్రపోజల్‌ నేపథ్యంలో మొదలైన ట్రైలర్‌ ఆధ్యంతం వినోదం పంచింది. భిన్న మనస్తత్వాలున్న దంపతులుగా రాజ్‌కుమార్‌ రావు, జాన్వీకపూర్‌ జంట సందర్భోచిత నటన ఆకట్టుకుంది. ఎప్పుడూ గొడవపడే దంపతులిద్దరినీ క్రికెట్‌ ఎలా ఒక్కటి చేసింది, మహి క్రికెటర్‌గా ఎదిగిన తీరును ట్రైలర్‌లో చూపించిన విధానం ఆసక్తికరంగా అనిపించింది. శరణ్‌ శర్మ దర్శకత్వంలో కరణ్‌ జోహార్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Updated Date - May 13 , 2024 | 12:08 AM