క్రేజీ కాంబినేషన్‌ కుదిరింది

ABN , Publish Date - Feb 28 , 2024 | 04:01 AM

‘జైలర్‌’ చిత్రం ఇచ్చిన సక్సెస్‌తో రజనీకాంత్‌ జోష్‌లో ఉన్నారు. వరుస చిత్రాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రసుతం ఆయన దర్శకుడు టీజే జ్ఞానవేల్‌ రాజా....

క్రేజీ కాంబినేషన్‌ కుదిరింది

‘జైలర్‌’ చిత్రం ఇచ్చిన సక్సెస్‌తో రజనీకాంత్‌ జోష్‌లో ఉన్నారు. వరుస చిత్రాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రసుతం ఆయన దర్శకుడు టీజే జ్ఞానవేల్‌ రాజా, లోకేశ్‌ కనగరాజ్‌తో సినిమాలు చేస్తున్నారు. తాజాగా రజనీకాంత్‌ హీరోగా మరో చిత్రం ఖాయమైంది. పలు కమర్షియల్‌ హిట్లు ఇచ్చిన బాలీవుడ్‌ నిర్మాత సాజిద్‌ నడియాడ్‌ వాలా కొత్త చిత్రాన్ని నిర్మించనున్నారు. మంగళవారం ఈ విషయాన్ని ఆయన సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. రజనీకాంత్‌ను కలసిన ఫొటోను షేర్‌ చేసి, ‘లెజండరీతో కలసి పనిచేసే అవకాశం నాకు దక్కిన గౌరవం. త్వరలోనే మా మరపురాని ప్రయాణం ప్రారంభిస్తాం’ అన్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటించే అవకాశముంది.

Updated Date - Feb 28 , 2024 | 04:01 AM