క్రేజీ కాంబినేషన్‌ షురూ?

ABN , Publish Date - Jan 03 , 2024 | 01:23 AM

ఒకరితో సినిమా అనుకోవడం.. ఇంకొకరితో సినిమా చేయడం ఇవన్నీ పరిశ్రమలో కామన్‌. ‘గుంటూరుకారం’ తర్వాత తివిక్రమ్‌ సినిమా బన్నీతో ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే..

క్రేజీ కాంబినేషన్‌ షురూ?

ఒకరితో సినిమా అనుకోవడం.. ఇంకొకరితో సినిమా చేయడం ఇవన్నీ పరిశ్రమలో కామన్‌. ‘గుంటూరుకారం’ తర్వాత తివిక్రమ్‌ సినిమా బన్నీతో ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే.. బన్నీ ‘పుష్ప2’ షూటింగ్‌ ఇప్పుడయ్యేలా లేదు. ఆ సినిమాను ఆగస్టులో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. అంటే.. దాదాపు జూలై దాకా షూటింగ్‌ జరుగుతూనే ఉంటుంది. మరోవైపు త్రివిక్రమ్‌ ‘గుంటూరుకారం’ రేపు సంక్రాంతికి వచ్చేస్తోంది. అంటే జులై దాకా ఆగాల్సిందే. అందుకేనేమో..! ప్రస్తుతం గురుజీ చూపు వెంకీవైపు మళ్లిందని ఫిలింనగర్‌ టాక్‌. ఈ లోపు వెంకటేశ్‌తో ఓ సినిమా చేసేయాలని ఆయన ఫక్సయ్యారట. వెంకటేశ్‌ బ్లాక్‌బాస్టర్స్‌ నువ్వు నాకు నచ్చావ్‌, మల్లీశ్వరి చిత్రాల రచయిత త్రివిక్రమే అన్న విషయం తెలిసిందే. వారిద్దరి కలయికలో సినిమా కోసం సగటు ప్రేక్షకుడు కూడా ఇష్టంగా ఎదురుచూస్తున్నాడు. త్రివిక్రమ్‌ కూడా వెంకీతో సినిమా చేయనున్నట్టు గతంలో ఓసారి చెప్పారు. ఎట్టకేలకు ఆ కాంబినేషన్‌ ఇప్పటికి సెట్‌ అయ్యిందని తెలుస్తోంది. అయితే.. ఇది వెంకీ సినిమా మాత్రమే కాదంట. ఇదో మల్టీస్టారర్‌ అని సమాచారం. రెండో హీరోగా నానీ నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడట. త్వరలోనే ఈసినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల కానుందని విశ్వసనీయ సమాచారం.

Updated Date - Jan 03 , 2024 | 01:23 AM