కమర్షియల్‌ హంగులతో కాప్‌

ABN , Publish Date - Apr 15 , 2024 | 12:54 AM

రవిశంకర్‌ ప్రధాన పాత్రధారిగా రూపొందిన కమర్షియల్‌ ఎంటర్టైన ర్‌ ‘కాప్‌’. నిఖిల్‌, రాజశేఖర్‌, తేజ హీరోలుగా నటిస్తున్నారు. బి. సోమసుందరం దర్శకత్వంలో...

కమర్షియల్‌ హంగులతో కాప్‌

రవిశంకర్‌ ప్రధాన పాత్రధారిగా రూపొందిన కమర్షియల్‌ ఎంటర్టైన ర్‌ ‘కాప్‌’. నిఖిల్‌, రాజశేఖర్‌, తేజ హీరోలుగా నటిస్తున్నారు. బి. సోమసుందరం దర్శకత్వంలో మాధవన్‌ సురేశ్‌ నిర్మిస్తున్నారు. ఇటీవలే తిరుపతిలో చిత్రబృందం ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘పొలిటికల్‌ సెటైర్‌తో పాటు కమర్షియల్‌ హంగులు ఉన్న చిత్రమిది. మంచి సందేశంతో ప్రజల్ని ఆలోచింపజేసే విధంగా తెరకెక్కించాం’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘వేసవిలో ‘కాప్‌’ను విడుదల చేస్తాం. అందరికీ నచ్చుతుంది’ అన్నారు.

Updated Date - Apr 15 , 2024 | 12:54 AM