కంప్లీట్‌ మాస్‌ ఎంటర్టైనర్‌

ABN , Publish Date - May 21 , 2024 | 06:08 AM

రామ్‌ తేజ్‌, వర్షిని, మౌనిక హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మల్లె మొగ్గ’. తోట వెంకట నాగేశ్వరరావు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌ను...

కంప్లీట్‌ మాస్‌ ఎంటర్టైనర్‌

రామ్‌ తేజ్‌, వర్షిని, మౌనిక హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మల్లె మొగ్గ’. తోట వెంకట నాగేశ్వరరావు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌ను సంపాదించుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సక్సెస్‌ మీట్‌ను నిర్వహిచండంతో పాటు రామ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘తథాస్తు’ సినిమా పోస్టర్‌ను లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత తోట వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ ‘‘మల్లె మొగ్గ’ సినిమాకు బీ,సీ సెంటర్లలో ఆదరణ బాగుంది. విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ప్రస్తుతం చేస్తున్న ‘తథాస్తు’ మూవీ కంప్లీట్‌ మాస్‌ ఎంటర్టైనర్‌’’ అని చెప్పారు. హీరో రామ్‌ తేజ్‌ మాట్లాడుతూ ‘‘మల్లె మొగ్గ’ సినిమా రూరల్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది. ఈ సినిమాను ఆదరించినట్టే ‘తథాస్తు’ చిత్రాన్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నా’’ అని అన్నారు. నటుడు భానుచందర్‌ మాట్లాడుతూ ‘‘చాలా మంచి కథతో తెరకెక్కిన చిత్రం ‘మల్లె మొగ్గ’. ఇందులో గుర్తుండిపోయే పాత్ర పోషించాను’’ అని చెప్పారు.

Updated Date - May 21 , 2024 | 06:08 AM