యూట్యూబర్‌పై ఫిర్యాదు

ABN , Publish Date - Sep 09 , 2024 | 05:19 AM

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ను, మంచు విష్ణును, ఇతర నటీ నటులను టార్గెట్‌ చేసి, విద్వేష పూరితంగా, అసభ్య పదజాలంతో కూడిన కంటెంట్‌తో అసత్యాలను సోషల్‌ మీడియాలో,

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ను, మంచు విష్ణును, ఇతర నటీ నటులను టార్గెట్‌ చేసి, విద్వేష పూరితంగా, అసభ్య పదజాలంతో కూడిన కంటెంట్‌తో అసత్యాలను సోషల్‌ మీడియాలో, తన యూ ట్యూబర్‌ చానల్స్‌ ద్వారా ప్రచారం చేస్తున్నాడని, విజయ్‌ చంద్రహాసన్‌ దేవరకాండపై ‘మా’ సంస్థ కోశాధికారి, నటడు శివబాలాజీ సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టెక్నికల్‌ ఎవిడెన్స్‌ను శివబాలాజీ పోలీసులకు అందజేశారు. సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ ముధులత నిందితుడిపై కేసు నమోదు చేసి, నోటీసులు జారీ చేశారు.

- హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి)

Updated Date - Sep 09 , 2024 | 05:19 AM