ఊహించని క్లైమాక్స్‌తో కమర్షియల్‌ కథ

ABN , Publish Date - Feb 20 , 2024 | 05:24 AM

వినూత్నమైన టైమ్‌ ట్రావెల్‌ కాన్సె్‌ప్టతో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఇంద్రాణి’. యానీయా భరద్వాజ్‌, కబీర్‌ దుహాన్‌ సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. స్టీఫెన్‌పల్లం దర్శకుడిగా పరిచయమవుతున్నారు...

ఊహించని క్లైమాక్స్‌తో కమర్షియల్‌ కథ

వినూత్నమైన టైమ్‌ ట్రావెల్‌ కాన్సె్‌ప్టతో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఇంద్రాణి’. యానీయా భరద్వాజ్‌, కబీర్‌ దుహాన్‌ సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. స్టీఫెన్‌పల్లం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వెరోనికా ఎంటర్టైన్‌మెంట్స్‌ బేనర్‌పై స్టాన్లీ సుమన్‌బాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను యూనిట్‌ విడుదల చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘నా సోదరుడు చెప్పిన కథతో ఈ సినిమాను తెరకెక్కించ్చాం. షూటింగ్‌ పూర్తయ్యాక వీఎ్‌ఫఎక్స్‌ కోసమే ఏడాది పాటు కష్టపడ్డాం. ఈ సినిమా క్లైమాక్స్‌ ఎవరూ ఊహించలేని విధంగా ఉంటుంది’ అన్నారు. అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో కూడిన మంచి సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ఇదని నిర్మాత చెప్పారు. సినమా ఓ దృశ్యకావ్యంలా ఉంటుంది, టైమ్‌ మెషీన్‌, రోబో ప్రేక్షకులను ఎంటర్టైన్‌ చేస్తాయి అని కబీర్‌ దుహాన్‌ సింగ్‌ తెలిపారు. గరీమా కౌశల్‌, ప్రతాప్‌ సింగ్‌, అజయ్‌, సప్తగిరి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సాయికార్తీక్‌ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: చరణ్‌ మాధవనేని.

Updated Date - Feb 20 , 2024 | 05:25 AM