కమర్షియల్‌ లవ్‌స్టోరీ

ABN , Publish Date - Feb 06 , 2024 | 01:07 AM

రుత్విక్‌ కొండకింది, విశాఖ దిమాన్‌ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న నూతన చిత్రం ‘రాజా ది రాజా’. మణికాంత్‌ గెల్లి దర్శకత్వంలో చాణక్య అద్దంకి, నిహారికా రెడ్డి నిర్మిస్తున్నారు. సోమవారం ఈ చిత్రం షూటింగ్‌...

కమర్షియల్‌ లవ్‌స్టోరీ

రుత్విక్‌ కొండకింది, విశాఖ దిమాన్‌ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న నూతన చిత్రం ‘రాజా ది రాజా’. మణికాంత్‌ గెల్లి దర్శకత్వంలో చాణక్య అద్దంకి, నిహారికా రెడ్డి నిర్మిస్తున్నారు. సోమవారం ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దర్శకులు రవిబాబు, ఎస్వీ కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ కలగలిసిన లవ్‌ స్టోరీ ఇది. కమర్షియల్‌ హంగులతో రూపొందిస్తున్నాం’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘ప్రకృతికి సంబంధించిన ఒక అంశం చుట్టూ అల్లుకున్న ఆసక్తికర కథతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. రెండు నెలల్లో షూటింగ్‌ పూర్తి చేస్తాం. జూన్‌లో విడుదల చేస్తామ’ని చెప్పారు. ఈ సినిమాలో తన పాత్ర ఎగ్జైటింగ్‌గా ఉంటుందని రుత్విక్‌ చెప్పారు.హీరోయిన్‌ అవ్వాలనే తన కల ‘రాజా ది రాజా’ చిత్రంతో తీరుతోందని విశాఖ దిమాన్‌ తెలిపారు.

Updated Date - Feb 06 , 2024 | 01:07 AM