వినోదానికి భావోద్వేగాల మేళవింపు

ABN , Publish Date - Jan 30 , 2024 | 05:29 AM

అభినవ్‌ గోమఠం, వైశాలి రాజ్‌ జంటగా నటించిన ‘మస్తు షేడ్స్‌ ఉన్నాయ్‌ రా’ చిత్రం వచ్చే నెల 23న విడుదల కానుంది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌తో పాటు విడుదల తేదీని సోమవారం నిర్మాతలు ప్రకటించారు....

వినోదానికి భావోద్వేగాల మేళవింపు

అభినవ్‌ గోమఠం, వైశాలి రాజ్‌ జంటగా నటించిన ‘మస్తు షేడ్స్‌ ఉన్నాయ్‌ రా’ చిత్రం వచ్చే నెల 23న విడుదల కానుంది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌తో పాటు విడుదల తేదీని సోమవారం నిర్మాతలు ప్రకటించారు. తిరుపతిరావు ఇండ్ల దర్శకత్వంలో భవాని కాసుల, ఆరెమ్‌ రెడ్డి, ప్రశాంత్‌ నిర్మించారు. చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ ‘హాస్య నటుడిగా, సహాయ నటుడిగా అందరి ప్రశంసలు అందుకున్న అభినవ్‌ లోని కొత్త కోణాన్ని ఈ చిత్రంలో చూస్తారు. భావోద్వేగాల మేళవింపుతో లవ్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌గా చిత్రాన్ని రూపొందించాం. ప్రతి పాత్ర చాలా సహజంగా ఉంటుంది. త్వరలోనే టీజర్‌ విడుదల చేస్తాం’ అని చెప్పారు. తరుణ్‌ భాస్కర్‌, అలీ రజా, మొయిన్‌, చక్రపాణి ఆనంద్‌, నిళల్‌గళ్‌ రవి తదితరులు ఈ చిత్రంలో నటించారు. కథ: అన్వర్‌ సాధిక్‌, మాటలు: రాధామోహన్‌ గంటి, ఫొటోగ్రఫీ: సిద్థార్థ స్వయంభూ.

Updated Date - Jan 30 , 2024 | 05:29 AM