భావోద్వేగాల సమ్మేళనం
ABN , Publish Date - Aug 16 , 2024 | 12:18 AM
బండి సరోజ్‌కుమార్ కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘పరాక్రమం’. ఈ నెల 22న సినిమా విడుదలవుతోన్న సందర్భంగా చిత్రబృందం ట్రైలర్‌ను...
బండి సరోజ్‌కుమార్ కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘పరాక్రమం’. ఈ నెల 22న సినిమా విడుదలవుతోన్న సందర్భంగా చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సందీప్ కిషన్ మాట్లాడుతూ ‘‘సరోజ్ కుమార్ నిజాయితీ గల దర్శకుడు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ‘‘ప్రతీ కామన్ మ్యాన్‌కు కనెక్టయ్యే చిత్రమిది. ఈ సినిమా ఎన్నో భావోద్వేగాల సమ్మేళనం’’ అని దర్శకుడు బండి సరోజ్‌కుమార్ అన్నారు.