జీరో బడ్జెట్‌తో శరపంజరం

ABN , Publish Date - Apr 14 , 2024 | 04:01 AM

గంగిరెద్దుల అబ్బాయితో జోగిని ప్రేమలో పడితే ఎటువంటి పరిణామాలు సంభవించాయన్న ఇతివృత్తంతో రూపుదిద్దుకున్న ‘శరపంజరం’ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంద...

జీరో బడ్జెట్‌తో శరపంజరం

గంగిరెద్దుల అబ్బాయితో జోగిని ప్రేమలో పడితే ఎటువంటి పరిణామాలు సంభవించాయన్న ఇతివృత్తంతో రూపుదిద్దుకున్న ‘శరపంజరం’ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంద. నవీన్‌కుమార్‌ గట్టు, లయ జంటగా నటించారు.ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో నవీన్‌కుమార్‌ మాట్లాడుతూ ‘ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డాను. ఎంతోమంది మిత్రులు నాకు అండగా నిలిచారు. జీరో బడ్జెట్‌తో కేవలం స్నేహితుల సహకారంతో ప్రారంభించిన ఈ యజ్ఞం పూర్తి చేసి విడుదల వరకూ వచ్చాం. గణపతిరెడ్డి మాకు ఎంతో సహకరించారు.’ అని చెప్పారు. సంగీత దర్శకుడు మల్లిక్‌ ద్వారా ఈ సినిమా గురించి తెలిసిందనీ, ఆకలితో ఉన్న వాడికి అన్నం పెడితే జీవితాంతం గుర్తుంచుకుంటాడని, ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలనీ గణపతిరెడ్డి అన్నారు.

Updated Date - Apr 14 , 2024 | 04:01 AM