పెద్ద విజయాన్ని సాధించాలి

ABN , Publish Date - Mar 28 , 2024 | 01:05 AM

విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్‌ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. రమాకాంత్‌ రెడ్డి దర్శకత్వంలో డాక్టర్‌ కందుల చంద్ర ఓబుల్‌ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేశ్‌లు నిర్మించారు...

పెద్ద విజయాన్ని సాధించాలి

విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్‌ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. రమాకాంత్‌ రెడ్డి దర్శకత్వంలో డాక్టర్‌ కందుల చంద్ర ఓబుల్‌ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేశ్‌లు నిర్మించారు. ఈ నెల 29న విడుదలవుతోంది. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు హీరో సుమన్‌, నిర్మాత ఏ.ఎం రత్నం అతిథులుగా విచ్చేశారు. సుమన్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అని కోరుకున్నారు. నిర్మాత ఏ.ఎం.రత్నం మాట్లాడుతూ ‘‘టైటిల్‌ కొత్తగా ఉంది’’ అని చెప్పారు. డైరెక్టర్‌ రమాకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘ఈ సినిమా అందరినీ మెప్పిస్తుంది’’ అని చెప్పారు. ‘‘సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని నిర్మాతలు అన్నారు. విశ్వ కార్తికేయ మాట్లాడుతూ ‘‘డిఫెరెంట్‌ కాన్సెప్టుతో వస్తోన్న ఈ చిత్రం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది’’ అని చెప్పారు.

Updated Date - Mar 28 , 2024 | 01:05 AM