35 రోజులు.. రూ 15 కోట్లు!

ABN , Publish Date - Jun 27 , 2024 | 12:24 AM

వరుణ్‌తేజ్‌ తాజాగా నటిస్తున్న చిత్రం ‘మట్కా’. ప్రస్తుతం మూడో షెడ్యూల్‌ షూటింగ్‌ జరుగుతోంది. 35 రోజుల పాటు ఏకధాటిగా జరిగే ఈ షెడ్యూల్‌ కోసం రూ. 15 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. వైజాగ్‌ నేపథ్యంలో...

35 రోజులు.. రూ 15 కోట్లు!

వరుణ్‌తేజ్‌ తాజాగా నటిస్తున్న చిత్రం ‘మట్కా’. ప్రస్తుతం మూడో షెడ్యూల్‌ షూటింగ్‌ జరుగుతోంది. 35 రోజుల పాటు ఏకధాటిగా జరిగే ఈ షెడ్యూల్‌ కోసం రూ. 15 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. వైజాగ్‌ నేపథ్యంలో జరిగే కథ కనుక రామోజీ ఫిల్మ్‌ సిటీలో వింటేజ్‌ వైజాగ్‌ సెట్‌ వేశారు. ప్రేక్షకులకు అథెంటిసిటీ, గ్రాండియర్‌ సినిమాటిక్‌ ఎక్ప్‌పీరియన్స్‌ అందించే లక్ష్యంతో టీమ్‌ వర్క్‌ చేస్తోంది. వరుణ్‌తేజ్‌ కెరీర్‌లో మరో మరుపురాని పాత్రలో నిలిచిపోయేందుకు దర్శకుడు కరుణకుమార్‌ కృషి చేస్తున్నారు. దేశాన్ని కదిలించిన యథార్థ సంఘటనల ఆధారంగా దర్శకుడు ఈ చిత్రం స్ర్కిప్ట్‌ రూపొందించారు. ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతి కలిగించే విదంగా తయారవుతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయిక. బాలీవుడ్‌ నటి నోరా ఫతేహి కీలక పాత్ర పోషిస్తోంది. డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి, రజనీ తాళ్లూరి ఈ చిత్రానికి నిర్మాతలు.

Updated Date - Jun 27 , 2024 | 12:24 AM