30 మంది నటులు.. 500 మంది డాన్సర్లు

ABN , Publish Date - Apr 24 , 2024 | 05:26 AM

సినిమాలో ఒక పాటలో ఒకరు కాదు. ఇద్దరు కాదు.. ఏకంగా 30 మంది నటులు, వారికి తోడు 500 మంది డాన్సర్లు పాల్గొనడం.. ఆసక్తికరంగా అనిపిస్తోంది కదూ. ఈ హంగామా దేనికోసం అంటారా.. ‘వెల్‌కమ్‌’ సిరీ్‌సలో...

30 మంది నటులు.. 500 మంది డాన్సర్లు

సినిమాలో ఒక పాటలో ఒకరు కాదు. ఇద్దరు కాదు.. ఏకంగా 30 మంది నటులు, వారికి తోడు 500 మంది డాన్సర్లు పాల్గొనడం.. ఆసక్తికరంగా అనిపిస్తోంది కదూ. ఈ హంగామా దేనికోసం అంటారా.. ‘వెల్‌కమ్‌’ సిరీ్‌సలో మూడో భాగంగా వస్తున్న ‘వెల్‌కమ్‌ టు ది జంగిల్‌’ చిత్రం కోసం. ఈ యాక్షన్‌ అడ్వెంచర్‌ కామెడీ డ్రామాను అహ్మద్‌ ఖాన్‌ తెరకెక్కిస్తున్నారు. అక్షయ్‌కుమార్‌, సంజయ్‌ దత్‌, సునీల్‌ శెట్టి. దిశా పటానీ, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, లారా దత్తా తదితరులతో కూడిన భారీ తారాగణం ఇందులో నటిస్తున్నారు. వీరందరితో పాటు మరికొందరు తారలు ఈ పాట చిత్రీకరణలో పాల్గొంటారట.

Updated Date - Apr 24 , 2024 | 05:26 AM