Hanu man : అయోధ్య రాముడికి హను-మాన్‌ 2.6 కోట్లు

ABN , Publish Date - Jan 22 , 2024 | 01:05 AM

ప్రస్తుతం బాక్సాఫీస్‌ దగ్గర ‘హను-మాన్‌’ ప్రభంజనం వీస్తోంది. భారీ వసూళ్లతో ఈ సినిమా దూసుకుపోతోందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే దాదాపుగా 150కోట్ల గ్రాస్‌ వసూళ్లను ఈ సినిమా రాబట్టిందని...

Hanu man : అయోధ్య రాముడికి హను-మాన్‌ 2.6 కోట్లు

ప్రస్తుతం బాక్సాఫీస్‌ దగ్గర ‘హను-మాన్‌’ ప్రభంజనం వీస్తోంది. భారీ వసూళ్లతో ఈ సినిమా దూసుకుపోతోందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే దాదాపుగా 150కోట్ల గ్రాస్‌ వసూళ్లను ఈ సినిమా రాబట్టిందని మేకర్స్‌ చెబుతున్నారు. ఇదిలావుంటే.. ‘హను-మాన్‌’ విజయానందాన్ని వెలిబుచ్చుతూ, రెండుకోట్ల 66లక్షల 41వేల 55 రూపాయిల మొత్తాన్ని అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహ ప్రాణప్రతిష్టామహోత్సవ శుభసందర్భంలో, ఆయోధ్య రామమందిరానికి అందజేయనున్నట్టు ‘హను-మాన్‌’ చిత్రబృందం ప్రకటించింది. అమ్ముడైన టికెట్‌ ధర నుంచి 5రూ.ని అయోధ్య రామాలయానికి అందిస్తామని విడుదలకు ముందే నిర్మాత ప్రకటించిన విషయం తెలిసిందే. మాట నిలబెట్టుకుంటూ.. ఇప్పటివరకూ విక్రయించిన 53లక్షల 28వేల 211 టికెట్లలో, ఒక్కో టికెట్‌ నుంచి 5రూ. చొప్పున మొత్తం రెండుకోట్ల 66లక్షల 41వేల 55 రూపాయిలు రామమందిరానికి నిర్మాత అందించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత నిరంజన్‌రెడ్డి, దర్శకుడు ప్రశాంత్‌వర్మ, కథానాయకుడు తేజా సజ్జా ఆదివారం ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.

Updated Date - Jan 22 , 2024 | 01:05 AM