1980 బ్యాక్ డ్రాప్‌లో...
ABN , Publish Date - Oct 16 , 2024 | 06:05 AM
సన్ రైజ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాత స్వాతి సుధీర్ నిర్మిస్తున్న సినిమా రామ్ భజరంగ్. రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సి.హెచ్. సుధీర్ దర్శకత్వం వహిస్తున్నారు...
సన్ రైజ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాత స్వాతి సుధీర్ నిర్మిస్తున్న సినిమా రామ్ భజరంగ్. రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సి.హెచ్. సుధీర్ దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించారు. ‘గదర్ 2’ హీరోయిన్ సిమ్రత్ కౌర్, బిచ్చగాడు ఫేమ్ సట్న టీటస్, ఛాయాదేవి, మనసా రాధాకృష్ణన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. 1980 బ్యాక్ డ్రాప్‌లో రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. యాక్షన్‌తోపాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉండే ఈ సినిమాను వచ్చే ఏడాది ఐదు భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.