సైకిల్‌పై 1600 కిలోమీటర్లు!
ABN , Publish Date - Oct 17 , 2024 | 05:44 AM
అల్లు అర్జున్‌కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వాళ్లలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన మోహిత్ ఒకరు. తన అభిమాన హీరోను చూడాలని అలీఘర్ నుంచి సైకిల్‌పై బయలుదేరి 1600 కిలోమీటర్లు ప్రయాణించి....
అల్లు అర్జున్‌కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వాళ్లలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన మోహిత్ ఒకరు. తన అభిమాన హీరోను చూడాలని అలీఘర్ నుంచి సైకిల్‌పై బయలుదేరి 1600 కిలోమీటర్లు ప్రయాణించి అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నాడు. సైకిల్‌పై వందల కిలోమీటర్లు ప్రయాణించి తనను చేరుకున్న అభిమానిని చూసి ఆశ్చర్యపోయారు అల్లు అర్జున్ ఆప్యాయంగా అతనితో మాట్లాడారు. ‘హీరో అల్లు అర్జున్‌ని కలవడం నా జీవితంలో మరుపురాని అనుభూతి. సైక్లింగ్ మొదలు పెట్టే ముందు చాలా సార్లు హనుమాన్ చాలీసా చదివాను’ అని మోహిత్ తెలిపారు. అతనికి దారి ఖర్చులు ఇచ్చి మళ్లీ ఉత్తరప్రదేశ్‌కు పంపించారు అల్లు అర్జున్.