150 మంది ఫైటర్లు... 300 మంది జూనియర్స్‌

ABN , Publish Date - Sep 15 , 2024 | 02:54 AM

నందమూరి కల్యాణ్‌రామ్‌ నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్‌ శరవేగంతో జరుగుతోంది. ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్‌ ప్యాక్డ్‌ ఎంటర్‌టైనర్‌ను అశోక్‌ వర్ధన్‌ ముప్పా, సునీల్‌ బలుసు నిర్మిస్తున్నారు...

నందమూరి కల్యాణ్‌రామ్‌ నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్‌ శరవేగంతో జరుగుతోంది. ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్‌ ప్యాక్డ్‌ ఎంటర్‌టైనర్‌ను అశోక్‌ వర్ధన్‌ ముప్పా, సునీల్‌ బలుసు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం యాక్షన్‌ డైరెక్టర్‌ పీటర్‌ హెయిన్‌ సారథ్యంలో ఓ భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ చిత్రీకరిస్తున్నారు. 15 రోజుల పాటు కొనసాగే ఈ చిత్రీకరణంలో 150 మంది ఫైటర్లు, 300 మంది జూనియర్‌ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. సినిమాకు ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌ హైలైట్‌గా నిలుస్తుందని నిర్మాతలు చెప్పారు. విజయశాంతి పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సోహైల్‌ ఖాన్‌, సాయి మంజ్రేకర్‌, శ్రీకాంత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Updated Date - Sep 15 , 2024 | 02:54 AM