మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

1 Year for VBVK: వన్ ఇయర్ సెలబ్రేషన్స్‌లో.. ‘వినరో భాగ్యము విష్ణుకథ’

ABN, Publish Date - Feb 18 , 2024 | 02:35 PM

కిరణ్ అబ్బవరం సూపర్ హిట్ సినిమా ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఇవాళ్టితో ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది.

vbvk

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కెరీర్‌లో సూపర్ హిట్ సినిమా ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha). ఇవాళ్టితో ఈ సినిమా రిలీజై ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ వన్ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ (GA2 Pictures) బ్యానర్ లో బన్నీ వాసు (Bunny Vas ) నిర్మించగా.. నూతన దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు రూపొందించారు.

ఈ చిత్రంలో కాశ్మీరా పరదేశి (Kashmira), మురళీ శర్మ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. గతేడాది ఫిబ్రవరి 18న థియేటర్స్ లోకి వచ్చిన ఈ "వినరో భాగ్యము విష్ణుకథ" అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) సినిమాలో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) పర్ ఫార్మెన్స్ హైలైట్‌గా నిలించింది.


ఇంతకుముందు ఎప్పుడు రానటువంటి నైబర్ నంబర్ అనే ఇంట్రెస్టింగ్ పాయుంట్ తో వచ్చిన ఈ సినిమా సకుటుంబంగా ప్రేక్షకులు చూసే మంచి కథా కథనాలతో అందరినీ ఆకట్టుకుంది. మీడియా నుంచి పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకున్న ఈ చిత్రం మల్టీ జానర్ మూవీగా బాక్సాఫీస్ వద్ద సూప‌ర్ హిట్‌గా నిలిచింది. కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ప్రస్తుతం ’దిల్ రూబా‘ సినిమాతో పాటు ఆయన సొంత ప్రొడక్షన్ లో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాల పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఈ చిత్రం వ‌చ్చి ఏడాది అయిన సంద‌ర్బాన్ని పుర‌స్క‌రించుకుని #1YearforVBVK అనే యాష్ ట్యాగ్‌తో సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Updated Date - Feb 18 , 2024 | 02:35 PM