ఆస్కార్‌ విన్నర్‌కు అభినందనలు

ABN , Publish Date - Mar 11 , 2024 | 04:46 PM

బాలీవుడ్‌ నటి యామీ గౌతమ్‌ ఫిల్మ్‌ అవార్డులు నకిలీవంటూ కామెంట్‌ చేసింది. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది. కొన్నేళ్లుగా ఇండియాలో జరిగే అవార్డు షోలకు హాజరు కాకపోవడానికి కారణమదేనని, అలాంటి ఫేక్‌ అవార్డులపై నమ్మకం లేదని వెల్లడించింది.

 ఆస్కార్‌ విన్నర్‌కు అభినందనలు


బాలీవుడ్‌ నటి యామీ గౌతమ్‌ ఫిల్మ్‌ అవార్డులు నకిలీవంటూ కామెంట్‌ చేసింది. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది. కొన్నేళ్లుగా ఇండియాలో జరిగే అవార్డు షోలకు హాజరు కాకపోవడానికి కారణమదేనని, అలాంటి ఫేక్‌ అవార్డులపై నమ్మకం లేదని వెల్లడించింది. కానీ ఈ రోజు గ్లోబల్‌ ప్లాట్‌ఫామ్‌పై ఓర్పు, స్థిరత్వం, మరెన్నో భావోగ్వేగాలకు నిలబడే ఒక అసాధారణ నటుడిని చూస్తుంటే తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన అవార్డ్‌ దక్కించుకున్న మీ ప్రతిభకు అన్నింటికంటే అత్యుత్తమంగా నిలుస్తుందని ఓపెన్  హైమర్‌ నటుడు కిలియన్  మర్ఫీని (cillian murphy) అభినందిస్తూ ట్విటర్‌లో రాసుకొచ్చింది. ఈ సందర్భంగా యామీకి 2022లో ప్రముఖ అవార్డ్‌  దక్కలేదన్న విషయాన్ని గుర్తు చేసుకుంది.

అయితే అవార్డుల గురించి యామీ చేసిన వ్యాఖ్యలకు కొందరు సపోర్ట్‌ చేస్తుంటే మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల యామీ గౌతమ్‌ నటించిన 'ఆర్టికల్‌ 370' ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో నటనకుగానూ ఆమె ప్రశంసలు అందుకుంది.

Updated Date - Mar 11 , 2024 | 04:46 PM