Crakk: ఇదేం సినిమారా నాయనా.. ట్రైలరే ఈ రేంజ్‌లో ఉంది

ABN , Publish Date - Feb 09 , 2024 | 06:34 PM

తెలుగులో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన శక్తి, ఊసరవెళ్లి చిత్రాలలో విలన్ గా మంచి పేరు తెచ్చుకున్న నటుడు విద్యుత్ జమాల్. ఆయ‌న హీరోగా న‌టించిన బాలీవుడ్ చిత్రం క్రాక్. ఈ సినిమా ట్రైల‌ర్ కొద్ది సేప‌టి క్రితం విడుద‌ల చేయ‌గా అద్భుత రెస్పాన్స్ వ‌స్తోంది.

Crakk: ఇదేం సినిమారా నాయనా.. ట్రైలరే ఈ రేంజ్‌లో ఉంది
crakk

ఈ మధ్చ వచ్చిన, వస్తున్న సినిమాలన్నీ ఫుల్ యాక్షన్ జానర్లో వస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్, బాలీవుడ్, తమిళ ఇండస్ట్రీలన్నీ ఇప్పుడు వీటిపైనే ఎక్కువగా అధార పడుతున్నాయి. అయితే వీటిని మించిన యాక్షన్ సన్నివేశాలతో ఓ బాలీవుడ్ చిత్రం క్రాక్ (Crakk.. Jeetegaa Toh Jiyegaa) జీతేగా తో జీయేగా అనేది ట్యాగ్‌లైన్‌ రూపొందింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయగా అది చూసినవారంతా షాక్ అవుతున్నారు. ఇదేం సినిమారా నాయనా ఒక్క సినిమాలో ఇంతా యాక్షనా అంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

cr.jpg

తెలుగులో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన శక్తి, ఊసరవెళ్లి, తమిళ హీరో విజయ్ హీరోగా వచ్చిన తుఫాకి వంటి చిత్రాలలో విలన్ పాత్రలతో మంచి పేరు తెచ్చుకున్న నటుడు విద్యుత్ జమాల్ (Vidyut Jammwal). ఆ తర్వాత బాలీవుడ్ లో సెటిల్ అయిన ఈ హీరో.. వరుసగా హిందీ సినిమాలు చేస్తూ యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకుంటు న్నాడు. ఇప్పటివరకు ఆయన హిందీలో చేసిన కమాండో1, కమాండో 2, కమాండో 2, జంగ్లీ, యారా, ఖుదా హాఫీజ్, ఖుదా హాఫీజ్2 చిత్రాలు ఆయనకు ఇండియన్ వన్ అండ్ వన్ ఓన్లీ యాక్షన్ హీరో గుర్తింపు తీసుకువచ్చాయి.


ఈ క్రమంలోనే ఆయన తాజాగా నటిస్తున్న ఔట్ అండ్ ఔట్ యాక్షన్ చిత్రం క్రాక్ (Crakk). విద్యుత్ జమాల్ (Vidyut Jammwal) ఈ సినిమాలో హీరోగా నటిస్తుండడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఆదిత్యా దత్ (Aditya Datt) ఈ సినిమాకు దర్శకత్వం వహించగా భగవంత్ కేసరి విలన్ అర్జున్ రామ్ పాల్ (Arjun Rampal), అమీ జాక్షన్ (Amy Jackson), నోరా ఫతేహీ (Nora Fatehi) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ట్రైలర్ ను ఈ రోజు (శుక్రవారం) విడుదల చేయగా నిమిషాల్లో మిలియన్ వ్యూస్ సాధించి కొత్త రికార్డును నెలకొల్పింది. సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది.

vidy-running-a_d.webp

ఇక ట్రైలర్ విషయానికిి వస్తే.. ముంబై మురికివాడల్లో నివసించే సాధారణ యువకుడు ఓ రహస్య ప్రదేశంలో జరిగే ప్రమాదకరమైన కార్ రేసింగ్ పోటీల్లో పాల్గొనాల్సి వస్తుంది. విజయం సాధిస్తేనే బ్రతుకుతారనే పాయింట్ తో జరిగే ఆ పోటీల్లో గెలవడానికి హీరో చేసే పోరాటల నేపథ్యంలో మొదటి నుంచి చివరి వరకు మొత్తం కార్ రేసింగ్స్, బైక్ స్టంట్స్, అదిరిపోయే ఫైటింగ్ సీక్వెన్స్ తో నింపేశారు.

ఈ ట్రైలర్ చూసిన వారంతా ఇదేం సినిమారా నాయనా అని అనుకుంటున్నారు. హాలీవుడ్ స్థాయిలో, టోనీ జాను మైమరిపించే లెవల్లో పోరాట సన్నివేశాలు ఉన్నాయంటు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అయితే ఈ సినిమాను ఈ ఫిబ్రవరి 23న ప్రపంచ వ్యాప్తంగా హిందీలో విడుదల కానుంది. మీరు ింతవరకు ఈ ట్రైలర్ చూడలేదా ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే చూసేయండి మరి.

Updated Date - Feb 09 , 2024 | 06:37 PM