Varinder Chawla: లోపల ఒకలా.. బయట ఒకలా ఉంటారు.. ఫేక్‌ హీరోలు!

ABN , Publish Date - Jun 09 , 2024 | 01:37 PM

కొంతకాలంగా ఇండియన్  సినిమా అంటే ఠక్కున మదిలో మెదిలేది తెలుగు చిత్ర పరిశ్రమ. 'బాహుబలి' సినిమాతో టాలీవుడ్‌ స్థాయిని పెంచేశారు దర్శకుడు రాజమౌళి. ఆ తర్వాత 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా హాలీవుడ్‌ మేకర్స్‌ ప్రశంసలు అందుకున్నాడు.

Varinder Chawla: లోపల ఒకలా.. బయట ఒకలా ఉంటారు.. ఫేక్‌ హీరోలు!


కొంతకాలంగా ఇండియన్  సినిమా అంటే ఠక్కున మదిలో మెదిలేది తెలుగు చిత్ర పరిశ్రమ. 'బాహుబలి' సినిమాతో టాలీవుడ్‌ స్థాయిని పెంచేశారు దర్శకుడు రాజమౌళి. ఆ తర్వాత 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా హాలీవుడ్‌ మేకర్స్‌ ప్రశంసలు అందుకున్నాడు. ఆ చిత్రం ఆస్కార్‌ వేడికపై సందడి చేసి ప్రపంచ దృష్టించి ఆకర్షించారు. ఇప్పుడు తెలుగు సినిమా గొప్పతనం గురించి విదేశీయులు కొనియాడుతున్నారు. అయితే కొందరు మాత్రం తెలుగు, దక్షిణాది సినిమాను విమర్శిస్తూనే ఉన్నారు. బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత బాలీవుడ్‌ ఇండస్ట్రీ పై  విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. నెపోటిజం, యాక్టర్స్‌ యాటిట్యూడ్‌ పై అడియన్స్‌ బహిరంగంగానే కామెంట్స్‌ చేశారు. అలాగే సోషల్‌ మీడియాలో 'బైకాట్‌ బాలీవుడ్‌' అనే ట్యాగ్‌ విపరీతంగా వైరల్‌ అయింది. దాంతో చాలాకాలం హిందీలో చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్స్‌ అయ్యాయి.  ఈ క్రమంలోనే ఇటు సౌత్‌ హీరోలను తెగ పొగిడేశారు నెటిజన్లు. సౌత్  స్టార్స్‌ అందరూ సాధారణంగా ఉంటారనీ, వారిలో ఎలాంటి యాటిట్యూడ్‌ కనిపించదంటూ బీటౌన్‌ హీరోలతో పోలుస్తూ కామెంట్స్‌ చేశారు. తాజాగా బాలీవుడ్‌ ఫొటోగ్రాఫర్‌ వరిందర్ చావ్లా (Varinder Chawla) టాలీవుడ్‌ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సౌత్‌ హీరోలంతా ఫేక్‌ అని.. కెమెరా ముందు వాళ్లంతా నటిస్తారని, యాటిట్యూడ్‌ ఎక్కువ అని విమర్శించారు.


ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న Varinder Chawla మాట్లాడుతూ ‘‘సౌత్‌ సెలబ్రిటీస్‌ మొత్తం ఫేక్‌గా కనిపిస్తారు. వారంతా కెమెరా ముందు తాము ఎంతో ఒదిగి ఉన్నట్లు నటిస్తారు. కానీ వారు ఎలా ఎప్పుడు సహనం కోల్పోతారో చెప్పలేం. ఒక హీరో (విజయ్‌ దేవరకొండ) సినిమా ప్రమోషన్లకు చెప్పులు వేసుకుని వచ్చాడు. సింపుల్‌గా ఉన్నట్లు చూపించుకోవడానికి అలా నటించాడు. మరో హీరో (జూనియర్‌ ఎన్టీఆర్‌) ఎప్పుడూ సైలెంట్‌గా ఉంటాడు. అతడు ఓ హోటల్‌కు వెళ్తుండగా.. ఫోటోగ్రాఫర్‌ అతడిని వీడియో తీశాడు. వెంటనే ఆయన మాపై కోప్పడ్డాడు. నిజానికి అతడి ఫోటో తీసింది వేరే వ్యక్తి. కానీ అతను మాపై కోప్పడ్డాడు. అలాగే మరో సూపర్‌ స్టార్‌ (మహేష్‌ బాబు) బాలీవుడ్‌ నాకు అవసరం లేదని చెప్పాడు. అతడు ఇంత యాటిట్యూడ్‌ చూపిస్తున్నారేంటీ అనుకున్నాను. సౌత్‌ హీరోలు చాలా ఫేక్‌. బాలీవుడ్‌ హీరోస్‌ లోపల బయట ఒకేలా ఉంటారు’’ అంటూ చెప్పుకొచ్చాడు. వీరేందర్‌ చావ్లా చేసిన కామెంట్స్‌ నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో మరోసారి బాలీవుడ్‌ వర్సెస్‌ టాలీవుడ్‌ ట్యాగ్‌ నెట్టింట ట్రెండ్‌ అవుతుంది. వరిందర్ చావ్లా చేసిన కామెంట్స్‌ పై సౌత్‌ అడియన్స్‌ మండిపడుతున్నారు. బాలీవుడ్‌ ఇండస్ర్టీలో చాలా మంది స్టార్స్‌ అనవసరంగా ఇతరులను తక్కువ చేస్తూ మాట్లాడుతుంటారని.. అలాగే హిందీలో నెపోటిజం ఎక్కువగా ఉంటుందని.. కొత్తవారికి అసలు అవకాశాలు  ఇవ్వరంటూ కౌంటర్లు వేస్తున్నారు నెటిజన్లు. 

Updated Date - Jun 09 , 2024 | 03:34 PM