మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Uppena Remake: బాలీవుడ్‌కి ఉప్పెన.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత!

ABN, Publish Date - Mar 22 , 2024 | 04:05 PM

వైష్ణవ్‌ తేజ్‌(Vaishnav tej), కృతిశెటి(krithishetty), బుచ్చిబాబు సాన కాంబోలో వచ్చిన తొలి చిత్రం ‘ఉప్పెన’. సూపర్‌ హిట్‌ అందుకోవడమే కాకుండా జాతీయ పురస్కారం కూడా అందుకొంది. ఈ  చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేయబోతున్నారనే వార్త కొంతకాలంగా హల్‌చల్‌ చేస్తోంది.

Uppena Remake: బాలీవుడ్‌కి ఉప్పెన.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత!

వైష్ణవ్‌ తేజ్‌(Vaishnav tej), కృతిశెటి(krithishetty), బుచ్చిబాబు సాన కాంబోలో వచ్చిన తొలి చిత్రం ‘ఉప్పెన’. సూపర్‌ హిట్‌ అందుకోవడమే కాకుండా జాతీయ పురస్కారం కూడా అందుకొంది. ఈ  చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేయబోతున్నారనే వార్త కొంతకాలంగా హల్‌చల్‌ చేస్తోంది. తాజాగా బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ స్వయంగా ఈ రీమేక్‌ గురించి వెల్లడించారు. రామ్‌చరణ్‌ తాజా చిత్రం ఆర్‌సీ16 పూజా కార్యక్రమానికి జాన్వీతో పాటు బోనీకపూర్‌ హాజరయ్యారు. ఆ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ.. ‘బుచ్చిబాబు ‘ఉప్పెన’ చూశాను. చాలా నచ్చింది. దీన్ని హిందీలో రీమేక్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. నా చిన్న కూతురు ఖుషీ కపూర్‌ను కూడా ‘ఉప్పెన’ చూడమని చెప్పాను’ అన్నారు. ఖుషీకి ఈ చిత్రం నచ్చి ఓకే అంటే త్వరలోనే  ఈ చిత్రం రీమేక్‌ ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇందులో హీరోగా ఎవరిని తీసుకుంటారు. తెలుగులో సాధించిన విజయం హిందీలో సాధిస్తుందా అనే చర్చలు మొదలయ్యాయి. (Uppena remake in Hindi)

ఇప్పటికే ఖుషీ కపూర్‌ ఓ షార్ట్‌ ఫిల్మ్‌, జోయా అక్తర్‌ దర్శకత్వంలో ుద అర్చీస్‌’ చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం మరో చిత్రాలు లైన్ లో ఉన్నాయని సమాచారం.  బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు ఆమిర్‌ఖాన్‌, సైఫ్‌ అలీఖాన్‌ కుమారు సినిమాల్లో ఆమె నటించనున్నారట. కరణ్‌ జోహార్‌ నిర్మిస్తోన్న ‘నాదనియాన్‌’ చిత్రంలో సైఫ్‌ అలీఖాన్‌ కుమారుడు ఇబ్రహీం ఖాన్‌ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఖుషీని తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే, ఆమిర్‌ఖాన్‌ కుమారుడు జువైద్‌ ఖాన్‌తోనూ ఆమె జోడీ కట్టనున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Mar 22 , 2024 | 04:05 PM