TUMMBAD: రీ- రిలీజ్ సినిమాల్లోనే సరికొత్త రికార్డ్

ABN , Publish Date - Sep 23 , 2024 | 07:01 PM

2018లో విడుద‌లై డిజాస్ట‌ర్‌గా నిలిచిన చిత్రం తుంబడ్.. ఇప్పుడు రీ రిలీజ్ అవ‌గా భారీ కలెక్షన్స్ కొల్లగొట్టడమే కాక సరికొత్త రికార్డులు తిర‌గ‌రాస్తోంది.

Tumbbad

సినిమాలను రీ- రిలీజ్ చేసే ఆనవాయితీ తెలుగు నుంచి సౌత్ అంతటా పాకి ఇప్పుడు బాలీవుడ్‌కు చేరుకుంది. అయితే ఈ కల్చర్ ద్వారా తెలుగు సినిమాలకంటే ఇతర భాష చిత్రాలకే ఎక్కవ లాభం చేకూరుతోంది. 2018లో 15కోట్ల బడ్జెట్‌తో రిలీజై రూ.15 కోట్ల బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌గా నిలిచినా చిత్రం తుంబడ్ (TUMMBAD). ఆ తరువాత విమర్శల ప్రశంసలందుకున్న ఈ మూవీ OTTలో సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో మేకర్స్ ఈ మూవీని ఇటీవల మరోసారి రీ- రిలీజ్ చేశారు. కాగా, రిలీజ్‌తో మూవీ భారీ కలెక్షన్స్ కొల్లగొట్టడమే కాక సరికొత్త రికార్డ్‌లను సృష్టించింది.

images.jpeg

రాహి అనిల్ బార్వే, అనిల్ గాంధీ దర్శకత్వంలో సోహుమ్ షా ప్రధాన పాత్రలో ఫోక్ హార్రర్ (FOLK HORROR) జోనర్‌లో ఈ చిత్రం తెరెకెక్కిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ బాంబ్ నిలిచింది. ఆ తరువాత OTTలో అనూహ్యంగా వీక్షకుల, విమ్మర్శకుల ప్రశంసలతో సరికొత్త బజ్ క్రియేట్ చేసింది. ఓ తరుణంలో ఆస్కార్ నామినేషన్స్‌కి ఈ సినిమాని పరిశీలించినా.. జోయా అక్తర్ గల్లి బాయ్ (GULLY BOY) ఆ అవకాశాన్ని కొల్లగొట్టింది.

కాగా, ఇటీవల రీ రిలీజైన ఈ మూవీ 11 రోజుల్లోనే ఏకంగా 33 కోట్లు కొల్లగొట్టింది. ఇది రీ- రిలీజైన కలెక్షన్స్ లోనే అత్యధికం కావడం విశేషం. ఇది వరకు ఈ రికార్డ్ 33 కోట్లా ఫుల్ రన్ కలెక్షన్‌తో కోలీవుడ్ దళపతి విజయ్ (THALAPATHI VIJAY) గిల్లి (GHILLI) సినిమాపై ఉంది. అయితే 11వ రోజే తుంబడ్ (TUMMBAD) ఈ రికార్డ్‌ని బ్రేక్ చేసింది.

Updated Date - Sep 23 , 2024 | 07:01 PM