Triptii Dimri: ఎవరో.. ఏదో.. అనుకుంటారనుకుంటే ఇక్కడే ఉండిపోతాం!

ABN , Publish Date - Mar 01 , 2024 | 04:11 PM

త్రిప్తి..(tripti Dimri) ఈ మధ్యకాలంలో మోస్ట్‌ ట్రెండింగ్‌లో ఉన్న పేరు ఇది. మోడల్‌గా కెరీర్‌ మొదలుపెట్టి పలు చిత్రాల్లో నటించినా రాని పాపులారిటీ 'యానిమల్‌’ (Animal) చిత్రంలోని కొన్ని సీన్స్  ఒక్కసారిగా ఆమెను స్టార్‌ను చేసేసింది

Triptii Dimri: ఎవరో.. ఏదో.. అనుకుంటారనుకుంటే ఇక్కడే ఉండిపోతాం!


త్రిప్తి..(tripti Dimri) ఈ మధ్యకాలంలో మోస్ట్‌ ట్రెండింగ్‌లో ఉన్న పేరు ఇది. మోడల్‌గా కెరీర్‌ మొదలుపెట్టి పలు చిత్రాల్లో నటించినా రాని పాపులారిటీ 'యానిమల్‌’ (Animal) చిత్రంలోని కొన్ని సీన్స్  ఒక్కసారిగా ఆమెను స్టార్‌ను చేసేసింది. గత ఏడాది సూపర్‌హిట్‌ సాధించిన 'యానిమల్‌' చిత్రంలో త్రిప్తి కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి సోషల్‌ మీడియాలో ఆమె పేరు మార్మోగిపోతుంది. కొందరు మాత్రం ఈ చిత్రంలో ఆమె చేసిన హాట్‌ సీన్స్ పై  ట్రోలింగ్‌ చేస్తున్నారు. దీనిపై త్రిప్తి స్పందించారు.

Tripthi.jpg

‘‘సందీప్‌ వంగా (Sandeep Reddy vanga) స్టోరీ చెప్పినప్పుడే నాది చాలా చిన్న పాత్ర అని క్లియర్‌గా చెప్పారు. నాకైతే చిన్న పాత్ర అయినా ఆసక్తిగా అనిపించింది. ప్రేక్షకులు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ మన నిర్ణయాలు మార్చుకుంటే మనం చేయాలనుకున్నది, సాధించాలనుకున్నది జీవితంలో చేయలేం. ఎప్పుడూ సౌకర్యవంతమైన పాత్రలే చేయాలని నేను అనుకోను. ‘యానిమల్‌’లో నేను నటించిన శృంగార సన్నివేశాలు చూసి నా తల్లిదండ్రులు చూసి  ఉలిక్కిపడ్డారు. సినిమాకు ఆ సీన్‌ ఎంత ముఖ్యమో వారికి వివరించాను. గతంలో నా తొలి చిత్రం విడుదల తర్వాత మా నాన్న నేను నటినని అందరితో గర్వంగా చెప్పాలనుకున్నారు. అప్పుడు నాకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ చిత్రంతో నన్ను అందరూ గుర్తుపడుతున్నారు’’ అని అన్నారు.


ప్రస్తుతం త్రిప్తి ‘మేరే మెహబూబ్‌ మేరే సనమ్‌’, ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. తెలుగు మేకర్స్‌ కూడా ఆమెను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్‌ దేవరకొండ - గౌతమ్‌ తిన్ననూరి కాంబోలో రానున్న స్పై థ్రిల్లర్‌లో ఆమె నటించనున్నట్లు టాక్‌ నడుస్తోంది. రవితేజ హీరోగా అనిల్‌ రావిపూడి తెరకెక్కించనున్న చిత్రంలోనూ ఆమెను ఎంపిక చేసినట్లు ఫిల్మ్‌నగర్‌ టాక్‌. 

Updated Date - Mar 01 , 2024 | 04:13 PM