Tripti Dimri: బిలియన్ల బాధలున్నా ఉల్లాసాన్ని కలిగించేలా...

ABN , Publish Date - Mar 25 , 2024 | 06:51 PM

ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్‌ అయిన పేరు త్రిప్తి డిమ్రి (tripti dimri). యానిమల్‌ చిత్రంలో ఆమె చేసిన బోల్డ్‌ క్యారెక్టర్‌ అందుకు కారణం. అంతకుముందు కూడా ఆమె పలు చిత్రాల్లో నటించింది కానీ 'యానిమల్‌' చిత్రం మాత్రం ఒక రేంజ్‌లో గుర్తింపు తెచ్చింది.

Tripti Dimri: బిలియన్ల బాధలున్నా ఉల్లాసాన్ని కలిగించేలా...

ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్‌ అయిన పేరు త్రిప్తి డిమ్రి (tripti dimri). యానిమల్‌ చిత్రంలో ఆమె చేసిన బోల్డ్‌ క్యారెక్టర్‌ అందుకు కారణం. అంతకుముందు కూడా ఆమె పలు చిత్రాల్లో నటించింది కానీ 'యానిమల్‌' చిత్రం మాత్రం ఒక రేంజ్‌లో గుర్తింపు తెచ్చింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో త్రిప్తి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ఏ పాత్ర ఇచ్చినా దానికి వందశాతం న్యాయం చేయాలన్నారు త్రిప్తి. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రాపై తనకున్న అభిమానాన్ని వెల్లడించారు. ‘‘మరో దేశానికి వెళ్లి కెరీర్‌ ప్రారంభించాలంటే చాలా ధైర్యం కావాలి. ప్రియాంకకు ధైర్యం, ఆత్మవిశ్వాసం ఎక్కువ. అందుకే అలా హాలీవుడ్‌కు వెళ్లి అక్కడ సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ను కొనసాగిస్తోంది. ఆమె ఎంతోమంది హీరోయిన్ల కు  స్ఫూర్తి. నాకు ఆమె అంటే చాలా ఇష్టం. ప్రియాంక నటించిన ‘బర్ఫీ’ మొదటిసారి చూసినప్పుడు నేను ఆమెను గుర్తుపట్టలేదు. యాక్టర్స్‌కు ఉండాల్సిన మొదటి లక్షణమదే. ఏ పాత్ర చేస్తున్నా అందులో మనం కనిపించకూడదు. మన నటన మాత్రమే కనిపించాలి. ఆ పాత్ర పేరుతో మనల్ని పిలుస్తుంటే అంతకుమించిన ప్రశంస మరొకటి ఉండదు. నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసిన వ్యక్తుల్లో ప్రియాంక ఒకరు’’ అని తెలిపింది.



‘యానిమల్‌’తో హిట్‌ అందుకున్న త్రిప్తి.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె ‘భూల్‌ భూలయ్య’తోపాటు ‘బ్యాడ్‌ న్యూజ్‌’లో నటిస్తున్నారు. వాస్తవిక సంఘటనల ఆధారంగా రానున్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ని ఆనంద్‌ తివారీ తెరకెక్కిస్తున్నారు. ‘బ్యాడ్‌ న్యూజ్‌’ గురించి త్రిప్తి మాట్లాడుతూ ‘అత్యంత వినోదభరితమైన హంగామా కోసం సిద్థంగా ఉండండి. ఎన్ని బిలియన్ల బాధలున్నా ఉల్లాసాన్ని కలిగించే కామెడీ చిత్రం మీకోసం ఎదురుచూస్తోంది’ అన్నారు. జులై 19న సినిమా విడుదల కానుంది.

Updated Date - Mar 25 , 2024 | 06:51 PM