మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

OTT Sensation -The Kerala Story: అంచనాలకు మించి వ్యూస్‌ మినిట్స్‌తో!

ABN, Publish Date - Mar 03 , 2024 | 03:04 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. సినీ, రాజకీయ రంగాల్లోనూ ప్రకంపనలు సృష్టించిన ఈ చిత్రం ఎన్నో అడ్డంకుల నడుమ గత ఏడాది విడుదలై సంచలన విజయం సాధించింది. పలుచోట్ట నిషేధించినా సక్సెస్‌ కావడంలో ఎక్కడా తగ్గలేదు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’ (The Kerala story). సినీ, రాజకీయ రంగాల్లోనూ ప్రకంపనలు సృష్టించిన ఈ చిత్రం ఎన్నో అడ్డంకుల నడుమ గత ఏడాది విడుదలై సంచలన విజయం సాధించింది. పలుచోట్ట నిషేధించినా సక్సెస్‌ కావడంలో ఎక్కడా తగ్గలేదు. ఓటీటీ విడుదలకు కూడా అడ్డంకులు ఎదురయ్యాయి. ఆ సమస్యలు అన్నింటిని అధికగమించి ఎట్టకేలకు ఫిబ్రవరి 16న  ‘జీ5’ (zee5 OTT) వేదికగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. హిందీ, తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోనూ రికార్డు సృష్టించింది. స్ట్రీమింగ్  అవుతోన్న మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు టాప్‌వన్‌లో కొనసాగుతోంది. మొత్తం 300 మిలియన్ల వాచ్‌ మినిట్స్‌ మైలు రాయిని కూడా దాటేసినట్లు చెబుతూ జీ5 పోస్టర్‌ విడుదల చేసింది.

థియేటర్లో విడుదలైన తొమ్మిది నెలల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. అంచనాలకు మించిన వ్యూస్‌ సాధిస్తోంది. బాలీవుడ్‌ దర్శకుడు సుదీప్తో సేన ‘ది కేరళ స్టోరీ’ని తెరకెక్కించారు. కేరళలో కొన్నేళ్లుగా 32 వేల మంది యువతులు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడనే ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఓ నలుగురు ఐసిస్‌లో చేరిన నేపథ్యంతో ఈ కథ నడుస్తుంది.

Updated Date - Mar 03 , 2024 | 03:04 PM