Ajay: అజ‌య్ జాక్‌పాట్‌.. బాలీవుడ్ టాప్‌స్టార్ సినిమాలో ఛాన్స్‌

ABN , Publish Date - May 20 , 2024 | 03:51 PM

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు అజ‌య్. కేరీర్ ఆరంభం నుంచి ఎక్కువ‌గా ప్ర‌తినాయ‌క పాత్ర‌ల్లో క‌నిపించినా అడ‌పా ద‌డ‌పా స‌హాయ‌,కామెడీ పాత్ర‌ల‌తూనూ ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యాడు. తాజాగా అజ‌య్ జాక్‌పాట్ కొట్టాడు.. బాలీవుడ్ టాప్ స్టార్ అజ‌య్ దేవ‌గ‌ణ్ సినిమాలో ఛాన్స్ ద‌క్కించుకున్నాడు.

Ajay: అజ‌య్ జాక్‌పాట్‌.. బాలీవుడ్ టాప్‌స్టార్ సినిమాలో ఛాన్స్‌
ajay

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు అజ‌య్ (Ajay). కేరీర్ ఆరంభం నుంచి ఎక్కువ‌గా ప్ర‌తినాయ‌క పాత్ర‌ల్లో క‌నిపించినా అడ‌పా ద‌డ‌పా స‌హాయ‌,కామెడీ పాత్ర‌ల‌తూనూ ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యాడు. ముఖ్యంగా రాజ‌మౌళి విక్ర‌మార్కుడులోని టిట్లా అనే విల‌న్ పాత్ర ఆల్‌టైం వ‌న్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్ట‌ర్‌గా చ‌రిత్ర‌లో మిగిలిపోయింన‌డంలో అతిశ‌యోక్తి లేదు. ప్ర‌స్తుతం త‌మిళ‌, మ‌ల‌యాళ చిత్రాల్లోనూ అవ‌కాశాలు ద‌క్కించుకుంటూ బిజియ‌స్ట్ ఆర్టిస్ట్‌గా దూసుకుపోతున్నారు. తాజాగా బాలీవుడ్‌లో ఓ టాప్ స్టార్ చిత్రంలో అవ‌కాశం ద‌క్కించుకుని ఇప్పుడు తెలుగు, హిందీ సినిమా ఇండస్ట్రీల్లో హాట్‌టాపిక్‌గా మారాడు.

aja.webp

నాగ‌బాబు హీరోగా వ‌చ్చిన కౌర‌వ‌డు చిత్రంలో సినిమాల్లోకి అడుగుపెట్టిన అజ‌య్ (Ajay) ఆపై ఖుషి సినిమాలో చిన్న పాత్ర‌తో వెలుగులోకి వ‌చ్చాడు. కానీ మ‌హేశ్‌బాబుతో వ‌రుస‌గా చేసిన ఒక్క‌డు, అత‌డు,పోకిరి సినిమాల‌తో మంచి గుర్విపు ల‌భించ‌డంతో ఇక వెను తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా తెలుగు ఇండ‌స్ట్రీలో వ‌రుస‌గా సినిమా అవ‌కాశాలు ద‌క్కించుకుంటూ పోయారు. మ‌ధ్య‌లో హీరోగా ఇక‌టి రెండు సినిమాలు చేసినా క్యారెక‌ట్ర్ ఆర్టిస్ట్‌గానే సెటిల‌య్యారు. ఈక్ర‌మంలో త‌మిళంలో కొన్ని చిత్రాలు సైతం చేశారు.


aj.jpeg

అయితే తాజాగా అజ‌య్ (Ajay) బాలీవుడ్ టాప్ స్టార్ అజ‌య్ దేవ‌గ‌ణ్ (Ajay Devgn) న‌టిస్తోన్న సింగం3 (Singham3) సినిమాలో మంచి క్యారెక్ట‌ర్‌ను ద‌క్కించుకున్నాడు. ఇప్ప‌టికే రెండు భాగాలుగా వ‌చ్చిన ఈ సింగం సినిమా బాలీవుడ్‌లో రూ.100 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు సాధించి బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యం సాధించ‌గా ఇప్పుడు మూడో భాగం షూటింగ్ జ‌రుగుతోంది. ఆగ్ర ద‌ర్శ‌కుడు రోహిత్ షెట్టి (Rohit Shetty) ఈ చిత్రానికి డైరెక్ట‌ర్ కావ‌డం విశేషం.

రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్‌లో అజ‌య్ దేవ‌గ‌ణ్‌ (Ajay Devgn)తో క‌లిసి అజ‌య్ దిగిన ఫొటో బ‌య‌ట‌కు రావ‌డంతో అంతా అజ‌య్‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తడ‌మే కాక శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. తెలుగు వారి ఖ్యాతిని ఇనుమ‌డింప‌చేశావ‌ని, బాలీవుడ్‌లోనూ బిజీ కావాల‌ని కోరుకుంటున్నారు. ఆల్ ది బెస్ట్ అజ‌య్‌.

Updated Date - May 20 , 2024 | 03:51 PM