Srirama Chandra: అప్పుడు  ఇండియన్ ఐడల్..  ఇప్పుడు 'ఝలక్‌  దిఖలా జా’

ABN , Publish Date - Feb 26 , 2024 | 02:35 PM

ఇండియన్ ఐడల్(2010) విన్నర్‌ శ్రీరామ చంద్ర గురించి పరిచయం అక్కర్లేదు. సంగీతమే శ్వాసగా కెరీర్‌ ప్రారంభించిన ఆయన ఎనిమిదేళ్ల వయసు నుంచే పాడటం ప్రారంభించారు.

Srirama Chandra: అప్పుడు  ఇండియన్ ఐడల్..  ఇప్పుడు 'ఝలక్‌  దిఖలా జా’

ఇండియన్ ఐడల్(2010) విన్నర్‌ శ్రీరామ చంద్ర (Srirama chandra) గురించి పరిచయం అక్కర్లేదు. సంగీతమే శ్వాసగా కెరీర్‌ ప్రారంభించిన ఆయన ఎనిమిదేళ్ల వయసు నుంచే పాడటం ప్రారంభించారు. ఎన్నో సంగీత పోటీల్లో పాల్గొని ట్రోపీలు అందుకున్నారు. తెలుగులో విజయవంతమైన చిత్రాలకు పాటలు పాడిన ఆయన 2010లో ఇండియన ఐడల్‌ కాంపిటీషన్లో  పాల్గొని ఫైనల్స్‌లో విజేతగా గెలిచి తెలుగు వారి సత్తా చాటారు. తదుపరి ఆయన ఎన్నో చిత్రాల్లో పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాదు సినిమాల్లో హీరోగా నటించారు. పలు చిత్రాలు కీలక పాత్రలు పోషించారు.

 
12 ఏళ్ల తర్వాత ఆయన మరోసారి సోనీ టీవీలో సందడి చేయనున్నారు. సోనీ టీవీలో జరుగుతున్న సెలబ్రిటీ డాన్స్  షో 'ఝలక్‌  దిఖలా జా’(Jhalak Dikhhla Jaa ) లో  శ్రీరామ చంద్ర పార్టిసిపేట్‌ చేస్తున్నారు.  పోటీలో సెమీ ఫైనల్స్‌కి చేరుకున్నారు. ట్రోపీ గెలవడానికి తెలుగువారంతా తమ ఓటుతో సపోర్ట్‌ చేయాలని సంగీత కళాకారులు పిలుపునిచ్చారు. 

Updated Date - Feb 26 , 2024 | 02:37 PM