ఇండియాలో సంపన్న నటులు వీరే

ABN , Publish Date - May 06 , 2024 | 01:31 PM

ప్రపంచంలోని  సంపన్న నటుల జాబితాలో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్  ఐదో స్దానంలో నిలిచాడు. మెటావర్స్ లో అంతర్బాగమైన వెల్త్  తాజాగా సంపన్న నటుల లిస్ట్ ను వెల్లడించింది.

ఇండియాలో సంపన్న నటులు వీరే

ప్రపంచంలోని  సంపన్న నటుల జాబితాలో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ (ShahRukh Khan) ఐదో స్దానంలో నిలిచాడు. మెటావర్స్ లో అంతర్బాగమైన వెల్త్  తాజాగా సంపన్న నటుల లిస్ట్ ను వెల్లడించింది. ఈ లిస్ట్ లో  ప్రసిద్ద హాలీవుడ్ నటులైన టామ్ క్రూజ్, మెల్ గిబ్సన్, రాబర్ట్ డౌనీ  జూనియర్ లాంటి స్టార్స్ ను షారుక్ వెనక్కి నెట్టాడు.

తొలి స్దానంలో అమెరికన్ నటి జామీ గెర్జ్ 3 బిలియన్ డాలర్ల సంపదతో టాప్ లో నిలిచింది. ఆమె భర్త టోనీ రెస్లర్ సైతం బిలియనీర్ కావటం విశేషం.‌ వీరిద్దరి ఆస్తి కలిపి 8 బిలియన్ డాలర్స్ ఉంటుందని అంచనా. రెండో స్దానంలో నిలిచిన నటుడు బ్రూక్ పీయర్స్ ఉన్నాడు.‌ నటనతో పాటు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టడం ద్వారా బ్రూక్  2 బిలియన్ డాలర్ల సంపద ను ఆర్జించాడు. అమెరికన్ స్డాండప్ కమెడియన్, నటుడు జెర్రీ సీన్ ఫెల్డ్  లిస్ట్ లో మూడో స్దానంలో ఉన్నాడు. అతని నెట్ వర్త్ 950 మిలియన్ డాలర్స్ గా ఉంది. సినిమాల నిర్మాణం తో పాటు, రైటర్ నటుడిగా వ్యవహరించిన‌ 70 ఏళ్ల జెర్రీ స్డాండప్ షోల ద్వారా ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. Bachan.jpg

జాబితాలో తదుపరి స్దానంలో  డ్వేన్ జాన్సన్ ఉన్నాడు. అతడి నికర ఆస్తుల‌ విలువ 800 మిలియన్ డాల‌ర్లు.  రెజ్లర్ నుంచి  డ్వేన్ నటుడిగా మారి, నటన‌తో పాటు, వ్యాపారంలోను వినోద పరిశ్రమలో అపారమైన విజయాన్ని సాధించాడు. ఇక ఐదో స్దానంలో షారూఖ్ 730 మిలియ‌న్ల డాల‌ర్ల‌తో  నిలిచాడు. ఇండియన్ రూపీస్ లో దీని విలువ 6 వేల కోట్లకు పైగానే ఉంటుంది. నటుడిగా,  నిర్మాతగా, బ్రాండ్ అంబాసిడర్ గా, ఐపీఎల్ టీమ్ ఓనర్ గానే ఎక్కువగా కనిపించే షారుక్  షేర్ మార్కెట్ , రియల్ ఎస్టేట్ మరియు పలు స్టార్టప్ లలో భారీ పెట్టుబడులను పెట్టడం ద్వారా విపరీతమైన ఆస్తులను కూడగట్టుకున్నాడు‌. హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ ధ‌న‌వంతులైన న‌టుల జాబితాలో ఆరో స్దానంలో నిలిచారు. 600 మిలియన్ డాల‌ర్ల‌  నికర ఆస్తుల‌ను క‌లిగి ఉన్న లిస్ట్ లో  ఉన్నారు.

హాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనిరేషన్ తీసుకునే  స్టార్ గా టామ్ క్రూజ్  కు ప్రత్యేక గుర్తింపు ఉంది.‌ సినిమాల ద్వారానే సంపాదించిన డబ్బును సినిమాల నిర్మాణంలోనే పెట్టి లాబాలను ఆర్జించాడు.‌ మరొపక్క అమెరికన్ రియల్ ఎస్టేట్ లోనూ 50 మిలియన్ డాలర్ల పెట్టుబడులను,  ఆర్ట్ మరియు కలక్టబులిటీలలో 10 మిలియన్ డాలర్స్ విలువ గల సొత్తు అతని సొంతం. టామ్ క్రూజ్ బాటలోనే జార్జ్ క్లూనీ, రాబర్ట్ డినీరో 500 మిలియన్ డాలర్ల సంపదను ఆర్జించారు. అమెరికన్ కమెడియన్ నటుడు కెవిన్ హర్ట్ 450 మిలియన్ డాలర్ల సంపదతో సంపన్న నటుల జాబితాలో చేరాడు.సినిమాలతో పాటు లిక్కర్ వ్యాపారం ద్వారా కెవిన్ కు భారీగా సంపద లబిస్తోంది.  అస్ట్రేలియన్ నటుడు నిర్మాత మెల్ గిబ్సన్ 425 మిలియన్ డాల్లర్ల నికర అస్తులతో లిస్ట్ లో పదో స్దానంలో నిలిచారు. సినిమాల నిర్మాణంతో పాటు లాస్ ఎంజెల్స్ ,అస్ట్రేలియా అంతటా , కొస్టారికా , మలిబు,  ఫిజి ఇలా‌ అనేక ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం లో మెల్ గిబ్సన్ పెట్టుబడులు పెట్టారు.

TOm.jpg

షారుక్ అనంతరం ఇండియా నుంచి సంపన్న నటుల‌జాబితాలో ఉన్నారు అమితాబ్ 410 మిలియన్ డాలర్స్ అనగా 3 వేల కోట్లకు పైగా అస్తులను  అమితాబ్ సంపాదించగలిగారు. నటనతో పాటు బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ ద్వారా అమితాబ్ తన రీ ఎంట్రీలో ఎక్కువ సంపాదనను  ఆర్జించారు. 81 ఏళ్ల వయస్సులోనూ వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోల తరహాలో పారితోషకాన్ని అందుకుంటున్నారు. ఇక జాకీ చాన్, విల్ స్మిత్ లాంటి నటులు 350 మిలియన్స్, ఐరన్ మ్యాన్ చిత్ర నటుడు రాబర్ట్ డౌనె జూనియర్ 300 మిలియన్ డాలర్ల నికర సంపద ను కలిగి ఉన్నారు. ‌ఓవరాల్ గా ఇండియా నుంచి షారుక్ , అమితాబ్ బచ్చన్ లు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా సంపన్న నటుల జాబితాలో పేరు సంపాదించగలిగారు.

Updated Date - May 06 , 2024 | 01:47 PM