కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రకుల్ గురించి సీరత్ కపూర్ ఏమి చెప్పిందో తెలిస్తే షాకవుతారు

ABN, Publish Date - Jan 11 , 2024 | 03:34 PM

రకుల్ ప్రీత్ బాలీవుడ్ లో పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె స్నేహితురాలు, నటి సీరత్ కపూర్ ఆమె గురించి ఒక నోట్ సామజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. అందులో రకుల్ గురించి సీరత్ ఏమి చెప్పిందో తెలుసా....

Seerat Kapoor and Rakul Preet Singh

అటు హిందీలోనూ, ఇటు దక్షిణాదిలోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంటూ అగ్ర నటీమణుల లిస్టులో వున్నారు రకుల్ ప్రీత్ సింగ్. ఆమె సామాజిక మాధ్యమాల్లో కూడా బాగా చురుకుగా వుంటారు. రకుల్ ప్రీత్ సింగ్ హిందీ చిత్రసీమలోకి ఆరంగేట్రం చేసి పదేళ్లు పూర్తి చేసుకుంది. ఆమె మొదటి సినిమా 'యారియాన్' జనవరి 10, 2014 లో విడుదలయింది. అయితే రకుల్ అంతకు ముందే కన్నడ, తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది. (Rakul Preet Singh completed ten years in Bollywood)

రకుల్ ప్రీత్ సింగ్ హిందీ సినిమా పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక నోట్ తన సామజిక మాధ్యమంలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా రకుల్ స్నేహితురాలు నటి అయిన సీరత్ కపూర్ కూడా రకుల్ గురించి తన అభిప్రాయాన్ని పంచుకోంది. ఈ సందర్భంగా సీరత్ తన సహచరి నటి అయిన రకుల్ ని ఎంతగానో అభినందించింది. రకుల్ కి తన వృత్తిపట్ల వుండే అంకితభావం, అలాగే తను ఎదిగిన తీరు సీరత్ తన లేఖలో ప్రస్తావించింది.

"ఒక దశాబ్దం పూర్తి చేసుకున్నందుకు నీకు అభినందనలు, రకుల్. నువ్వు నీ పనిని చేసుకుపోయే తీరు, ఈరోజు నువ్వు ఇంత పెద్ద స్థాయిలో వున్నావంటే దాని వెనకాల వుండే నీ కృషి, అలాగే నీ పరివర్తన ఇవన్నీ నీ వ్యక్తిత్వాన్ని తెలియచేస్తుంది. నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా వొదిగి వుండే నీ మనస్తత్వం, వినయంగా నీ పని చేసుకుపోయే తీరు అంతా మాలాంటివారికి ఎంతో స్ఫూర్తి దాయకం అవుతుంది," అని సీరత్ ఒక లేఖ రాసింది. (Seerat Kapoor talks about Rakul's ten years of journey in Bollywood)

రకుల్ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బాలీవుడ్, టాలీవుడ్ గ్యాంగ్ మొత్తం కొత్త సంవత్సరాన్ని థాయ్‌లాండ్ లో జరుపుకున్నారు. ఈ గ్యాంగ్ లో సీరత్ కూడా వుంది, అలాగే టాలీవుడ్ నటీమణులు లక్ష్మి మంచు, ప్రగ్య జైస్వాల్ కూడా వున్నారు. ఇక పని పరంగా చూస్తే, సీరత్ కపూర్ 2024లో మూడు నాలుగు తెలుగు సినిమాలతో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.

Updated Date - Jan 11 , 2024 | 03:34 PM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!