మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Sayaji Shinde: త్వరలోనే తిరగి వచ్చి ఎంటర్‌టైన్ చేస్తా

ABN, Publish Date - Apr 14 , 2024 | 12:06 PM

తన ఆరోగ్య పరిస్థితి గురించి అప్‌డేట్‌ ఇచ్చారు నటుడు సాయాజి షిండే (Sayaji shinde). గురువారం ఆయన తీవ్ర ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే!


తన ఆరోగ్య పరిస్థితి గురించి అప్‌డేట్‌ ఇచ్చారు నటుడు సాయాజి షిండే (Sayaji shinde). గురువారం ఆయన తీవ్ర ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే! పరీక్షించిన వైద్యులు గుండెలో రక్త నాళాల సమస్య ఉందని గ్రహించి యాంజియోప్లాస్టీ చేశారు. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ మేరకు సాయాజి షిండే తన ఆరోగ్య పరిస్థితిపై అప్‌డేట్‌ ఇస్తూ తాజాగా ఆయన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని.. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. తొందర్లో మళ్లీ ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయడానికి తిరిగి వస్తానన్నారు.

నెటిజన్లు ‘గెట్‌ వెల్‌ సూన్‌’ అంటూ కామెంట్స్‌ పెట్టారు. మహారాష్ట్రకు చెందిన సాయాజీ జేడీ చక్రవర్తి నటించిన ‘సూరి’తో తెలుగు తెరపై పరిచయం అయ్యారు. ‘ఠాగూర్‌’తో  ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. టాలీవుడ్‌లో తెరకెక్కిన చాలా చిత్రాల్లో ప్రతి నాయకుడు, సహాయనటుడిగా నటించి మెప్పించారు. (Sayaji shinde Health update)

Updated Date - Apr 14 , 2024 | 02:23 PM