Sandeep reddy Vanga: ఓ సారి మీ భర్త నటించిన 'దిల్‌’ చూడండి!

ABN , Publish Date - Feb 03 , 2024 | 10:50 AM

యానిమల్‌ చిత్రం ఎంతగా విజయం సాధించిందో అంతే విమర్శలకూ లోనైంది. తాజాగా ఈ చిత్రం నెట్స్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో వచ్చాక విమర్శలు రెట్టింపు అయ్యాయి. స్త్రీ విద్వేష చిత్రమని చాలామంది మండిపడ్డారు.

Sandeep reddy Vanga: ఓ సారి మీ భర్త నటించిన 'దిల్‌’ చూడండి!

'యానిమల్‌' (Animal) చిత్రం ఎంతగా విజయం సాధించిందో అంతే విమర్శలకూ లోనైంది. తాజాగా ఈ చిత్రం నెట్స్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో వచ్చాక విమర్శలు రెట్టింపు అయ్యాయి. స్త్రీ విద్వేష చిత్రమని చాలామంది మండిపడ్డారు. తాజాగా అమిర్ ఖాన్‌ (Ameer khan) మాజీ భార్య కిరణ్‌ రావు (Kiran rao) సైతం విమర్శలు సంధించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. బాహుబలి-2, కబీర్‌ సింగ్‌ సినిమాలు సైతం స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆమె కామెంట్‌ చేశారు. దీనిపై యానిమల్‌ చిత్ర దర్శకుడు సందీప్‌ రెడ్డి ఓ ఇంటర్వ్యూలోయ స్పందించారు. కిరణ్‌ రావు చేసిన విమర్శలపై ఆయనకు ప్రశ్న ఎదురైంది. దీనికి సందీప్‌ రెడ్డి వంగా (Sandeep reddy) తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఆమె పేరును ప్రస్తావన లేకుండా వ్యంగ్యాస్త్రాలు  సంధించారు. అమిర్‌ ఖాన్‌ నటించిన దిల్‌ సినిమా చూడాలని ఆమెకు సలహా ఇచ్చారు.

సందీప్‌ మాట్లాడుతూ.. ‘నేను ఆమెకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మీరు అమీర్‌ ఖాన్‌ని వెళ్లి అడగండి. ఆయన నటించిన దిల్‌ సినిమాలో దాదాపు అమ్మాయిపై రేప్‌కు ప్రయత్నించే పరిస్థితిని సృష్టించాడు. కానీ ఆ తర్వాత ఆమెనే తప్పు చేసినట్లుగా భావించేలా చేస్తాడు. కానీ చివరికి ఆ అమ్మాయి అతనితోనే ప్రేమలో పడుతుంది. మరీ ఇదంతా ఏమిటి? ఇలాంటివన్నీ తెలుసుకోకుండానే మాపై మాటల దాడి ఎలా చేస్తారో  అర్థం కావడం లేదు’ అని అన్నారు. రణబీర్‌ కపూర్‌, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రంలో అనిల్‌ కపూర్‌, బాబీ దేవోల్‌ కీలక పాత్రలు పోషించారు.

Updated Date - Feb 03 , 2024 | 11:03 AM