Citadel-Samantha: టైటిల్‌ వచ్చేసింది.. రిలీజ్ పై  నో క్లారిటీ!

ABN , Publish Date - Mar 19 , 2024 | 04:34 PM

దర్శక ద్వయం రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో వరుణ్‌ధావన్, సమంత జంటగా నటిస్తోన్న యాక్షన్‌ థ్రిల్లింగ్‌ సిరీస్‌ ‘సిటాడెల్‌’. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌కు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి

Citadel-Samantha: టైటిల్‌ వచ్చేసింది.. రిలీజ్ పై  నో క్లారిటీ!

దర్శక ద్వయం రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో వరుణ్‌ధావన్, సమంత జంటగా నటిస్తోన్న యాక్షన్‌ థ్రిల్లింగ్‌ సిరీస్‌ ‘సిటాడెల్‌’. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌కు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ముంబయి వేదికగా ప్రైమ్‌ వీడియో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ సిరీస్‌ టైటిల్‌ను ప్రకటించారు. దీనికి ‘సిటడెల్‌: హనీ-బన్నీ’ అని టైటిల్‌ ఖరారు చేశారు. అయితే  స్ట్రీమింగ్ ఎప్పుడనేది తెలియజేయలేదు.

Citadel.jpg

రాజ్‌, డీకే రూపొందిన ఈ సిరీస్‌లో కేకే మేనన్‌, సిమ్రన్‌, సోహమ్‌ మజుందార్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘ఫ్యామిలీ మ్యాన్‌2’లో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో అదరగొట్టిన సమంత ‘సిటాడెల్‌’ కోసం ప్రత్యేకంగా సిద్థమైంది. మార్షల్‌ ఆర్ట్స్‌లోనూ శిక్షణ పొందింది. వరుణ్‌, సమంతల కలిసి చేసే యాక్షన్‌ సన్నివేశాలు అలరిస్తాయని మేకర్స్‌ చెబుతున్నారు. సిటాడెల్‌ మాతృకలో ప్రియాంక చోప్రా రిచర్డ్‌ మ్యాడెన్‌ నటించారు. 

Updated Date - Mar 19 , 2024 | 04:35 PM