Salman khan: సల్మాన్ పై విమర్శలు.. ఆ ట్వీట్‌ చేసినందుకే!

ABN , Publish Date - Mar 14 , 2024 | 10:39 PM

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌  సోషల్‌ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల విడుదలైన ఓ చిత్రాన్ని ఉద్దేశించి ఆయన చేసిన పోస్ట్‌ ఇప్పుడు విపరీతంగా వైరల్‌గా మారింది.

 Salman khan: సల్మాన్ పై విమర్శలు.. ఆ ట్వీట్‌ చేసినందుకే!

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ (Salman khan) సోషల్‌ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల విడుదలైన ఓ చిత్రాన్ని ఉద్దేశించి ఆయన చేసిన పోస్ట్‌ ఇప్పుడు విపరీతంగా వైరల్‌గా మారింది. దీంతో ఆ పోస్ట్‌ తొలగించారు సల్మాన్. ఇంతకీ ఆయన మాట్లాడింది ఏంటంటే..బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ఖాన్‌ మాజీ సతీమణి, దర్శకురాలు కిరణ్‌రావు తెరకెక్కించిన ‘లాపతా లేడీస్‌’. కామెడీ డ్రామాగా సిద్థమైన ఈ చిత్రం మార్చి 1న విడుదలై మంచి స్పందన సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఉద్దేశించి సల్మాన్‌ఖాన్‌ బుధవారం ఓ ట్వీట్‌ చేశారు. తన తండ్రితో కలిసి ‘లాపతా లేడీస్‌’ సినిమా వీక్షించానన్నారు. ఆ చిత్రం ఎంతో నచ్చిందన్నారు. ఈ చిత్రంతో దర్శకురాలిగా తొలి అడుగువేసిన కిరణ్‌రావుకు అభినందనలు అంటూ పోస్ట్‌ చేశారు.

దీనిని చూసి పలువురు నెటిజన్లు సల్మాన్ ను  ట్రోల్‌ చేశారు. ‘‘సర్‌ జీ.. ఇది కిరణ్‌రావు తెరకెక్కించిన తొలి చిత్రం కాదు. దీనికంటే ముందు ఆమె ‘ధోబీఘాట్‌’కు దర్శకత్వం వహించారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఆ సినిమా ప్రీమియర్‌కు మీరు హాజరయ్యారు’’ అని వరుస కామెంట్స్‌ వచ్చాయి. దీంతో ఆయన పాత పోస్ట్‌ను తొలగించారు. గురువారం సాయంత్రం మరో పోస్ట్‌ పెట్టారు. ‘‘మీ వర్క్‌ చాలా బాగుంది కిరణ్‌రావు. నాతో కలిసి వర్క్‌ చేస్త్తారా’’ అని ట్వీట్‌ చేశారు.

Updated Date - Mar 14 , 2024 | 10:45 PM