మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

RIP Rituraj Singh: నటుడు రితురాజ్‌ సింగ్‌ కన్నుమూత

ABN, Publish Date - Feb 20 , 2024 | 01:18 PM

హిందీ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ టెలివిజన్‌ నటుడు రితురాజ్‌ సింగ్‌ (59) గుండెపోటుతో మరణించారు. సోమవారం అర్ధరాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు

హిందీ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.  ప్రముఖ టెలివిజన్‌ నటుడు రితురాజ్‌ సింగ్‌ (Rituraj Singh-59) గుండెపోటుతో(cardiac arrest) మరణించారు. సోమవారం అర్ధరాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. (RIP Rituraj Singh)

రితురాజ్‌ కొద్ది కాలంగా ఫ్యాంక్రియాస్‌, గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం ఇంటికి వచ్చారు. అయితే సోమవారం రాత్రి తీవ్ర అస్వస్థతతో కన్నుమూశారు. 1964లో రాజస్థాన్ లో జన్మించారు. ఆయన పూర్తి పేరు రితురాజ్‌ సింగ్‌ చంద్రావత సిసోడియా. స్కూలింగ్‌ అంతా ఢిల్లీలో చేశారు. తర్వాత అమెరికాలో వెళ్లారు. ఫైనల్‌గా 1993లో ముంబైలో స్థిరపడ్డారు. నాటకరంగం నుంచి వచ్చిన ఆయన ఓ టీవీ షోతో బాలీవుడ్‌కి పరిచయమయ్యారు. తదుపరి రితురాజ్‌ ఎన్నో టీవీ సీరియల్స్‌లో నటించారు. హీరో వరుణ్‌ ధావన్ , అలియా భట్‌ జంటగా తెరకెక్కిన 'బద్రీనాథ్‌కి దుల్హానియా’ చిత్రంలో నటించారు. వందకుపైగా టీవీ సీరియళ్లల్లో కీలక పాత్రలు  పోషించిన ఆయన కొన్ని వెబ్‌ సిరీస్ లోనూ  కనిపించారు. చివరిగా "తునివు’ యారియన్-2 (2023) చిత్రాల్లో నటించారు. రితురాజ్‌ సింగ్‌ మరణం పట్ల పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.   

Updated Date - Feb 20 , 2024 | 01:40 PM