మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ranbir kapoor: రామాయణం కోసం కసరత్తులు మొదలు!

ABN, Publish Date - Mar 26 , 2024 | 05:33 PM

బాలీవుడ్‌లో తెరకెక్కనున్న ‘రామాయణం’ (Ramayan)సినిమా అప్‌డేట్‌ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌(Ranbir kapoor) సీతగా సాయి పల్లవి (Sai pallavi), రావణుడిగా యశ్‌ కనపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.


బాలీవుడ్‌లో తెరకెక్కనున్న ‘రామాయణం’ (Ramayan)సినిమా అప్‌డేట్‌ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌(Ranbir kapoor) సీతగా సాయి పల్లవి (Sai pallavi), రావణుడిగా యశ్‌ కనపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నితీశ్‌ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. తాజాగా రణ్‌బీర్‌ విలువిద్యలు నేర్చుకుంటూ, వ్యాయామం చేస్తూ ఉన్న ఫొటోలు అతని ఆర్చరీ కోచ్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. దీంతో రాముడి పాత్రలో రణ్‌బీర్‌ ఖరారైనట్లే అభిమానులు భావిస్తున్నారు. ఇందులో హనుమంతుడిగా సన్నీ దేవోల్‌, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖ పాత్రలో రకుల్‌ ప్రీత్‌ పేర్లు వినిపిస్తున్నాయి.  శ్రీరామ నవమి సందర్బ?ంగా చిత్రబృందం ఏప్రిల్‌లో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.  


Updated Date - Mar 26 , 2024 | 05:35 PM