Kiara Advani: రామ్ చరణ్ హీరోయిన్ కి దక్కిన ఇంకో పెద్ద ఛాన్స్

ABN , Publish Date - Feb 20 , 2024 | 01:52 PM

'గేమ్ చెంజర్' లో రామ్ చరణ్ పక్కన చేస్తున్న కియారా అద్వానీ ఇప్పుడు ఇంకో పెద్ద ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో వస్తున్న 'డాన్ 3'లో కియారా అద్వానీ చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. రణవీర్ సింగ్ కథానాయకుడు.

Kiara Advani: రామ్ చరణ్ హీరోయిన్ కి దక్కిన ఇంకో పెద్ద ఛాన్స్
Kiara Advani

రామ్ చరణ్ తో 'గేమ్ చెంజర్' సినిమా చేస్తున్న బాలీవుడ్ నటి కియారా అద్వానీ ఇప్పుడు ఇంకో పెద్ద ఛాన్స్ కొట్టేసింది. దర్శకుడు ఫర్హాన్ అక్తర్ తీయబోయే 'డాన్ 3' సినిమాలో కియారా అద్వానీ చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇందులో రణవీర్ సింగ్ కథానాయకుడిగా నటిస్తుండగా, అతనికి జోడీగా కియారా అద్వానీ చేస్తున్నట్టుగా చిత్ర నిర్వాహకులు ఈరోజు ప్రకటించారు. ఇది ఇంతకు ముందు తీసిన 'డాన్' సినిమాకి రెండో సీక్వెల్ గా రావటం విశేషం.

ranveersinghdon.jpg

దర్శకుడు ఫర్హాన్ అక్తర్ సామాజిక మాధ్యమం ద్వారా ఈ విషయాన్ని చెపుతూ, మా డాన్ యూనివర్స్ కి స్వాగతం అంటూ కియారా అద్వానీ కి చెప్పారు. కియారా మొదటిసారిగా రణవీర్ సింగ్ తో ఈ సినిమాలో నటిస్తున్నారు, ఇంతకు ముందు ఆమె రణవీర్ సింగ్ తో చెయ్యలేదు. ఇంతకు ముందు వచ్చిన రెండు సినిమాలలో షా రుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా నటించారు, ఇప్పుడు రణవీర్ సింగ్ ఈ మూడో సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నారు.

kiaraadvaniglam.jpg

ఇది ఒక యాక్షన్ సినిమాగా తెరకెక్కనుంది అని అంటున్నారు, ఇందులో కియారా అద్వానీ ఒక యాక్షన్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, కియారా ఇంకో యాక్షన్ సినిమాలో కూడా నటిస్తున్నారు. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిపి నటిస్తున్న 'వార్ 2'లో కూడా కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఇంతవరకు యాక్షన్ పాత్రలు చెయ్యని కియారా ఇప్పుడు ఈ 'డాన్ 3', 'వార్ 2' లతో, యాక్షన్ జానర్‌లో కూడా తన ప్రతిభ చూపించుకోవడానికే అవకాశం దక్కింది. అలాగే తెలుగులో 'గేమ్ చెంజర్' లో రామ్ చరణ్ పక్కన నటిస్తోంది. దీనికి శంకర్ దర్శకుడు. ఈ సినిమా తెలుగుతో పాటు అన్ని భాషల్లో విడుదలవుతోంది.

Updated Date - Feb 20 , 2024 | 01:52 PM