Rakul Preet Singh: మోడీ మాట‌.. ర‌కుల్ పెళ్లి వేదిక మార్పు!

ABN , Publish Date - Feb 01 , 2024 | 12:48 PM

బాలీవుడ్ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్ త‌న ప్రేమికుడు నిర్మాత జాకీ భగ్నానీని త్వ‌ర‌లో వీదేశాల్లో డెస్టినేష‌న్ వెడ్డింగ్ చేసుకోబోతున్న విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు అందులో మార్పు జ‌రిగిన‌ట్లు స‌మాచారం.

Rakul Preet Singh: మోడీ మాట‌.. ర‌కుల్ పెళ్లి వేదిక మార్పు!
rakul

పుష్క‌ర‌కాలం క్రితం తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన బాలీవుడ్ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet) త‌న ప్రేమికుడు నిర్మాత జాకీ భగ్నానీ (Jackky Bhagnani)ని త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్న విష‌యం తెలిసిందే. ఫిభ్ర‌వ‌రి చివ‌రి వారాంతంలో వీదేశాల్లో డెస్టినేష‌న్ వెడ్డింగ్‌ (Destination Wedding) తో వీరు ఒక‌టికానున్నారు. ఈమేర‌కు ఇప్ప‌టికే ఏర్పాట్లు కూడా మొద‌లు పెట్టిన‌ట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ విష‌యంలో మార్పులు జ‌రిగాయ‌ని వీదేశాల్లో కాకుండా స్వ‌దేశంలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటు సోష‌ల్‌మీడియాలో వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి.

కొద్దిరోజుల క్రితం ప్ర‌ధాని మోధీ ల‌క్ష్య‌ద్వీప్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌ప్పుడు ఆయ‌న ప‌ర్యాట‌కులు, డెస్టినేష‌న్ వెడ్డింగ్ (Destination Wedding) చేసుకోవాల‌నుకునే వారు వేరే దేశాల‌కు వెళ్ల‌కుండా మ‌న దేశంలోనే మంచి ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌ను సెల‌క్ట్ చేసుకోవాల‌ని పిలుపునిచ్చారు. దీంతో దేశ‌వ్యాప్తంగా మంచి స్పంద‌న వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే ర‌కుల్ జంట కూడా త‌మ వీదేశాల‌లో (Destination Wedding) కాకుంండా మ‌న దేశంలోనే గోవాలో వివాహం చేసుకోవాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు వారి కుటుంబ స‌భ్యులు ఓ మీడియాకు తెలిపిన‌ట్టు స‌మాచారం.


ఈ మ‌ధ్యే అయోధ్య రామ‌మందిర ప్రాణ‌ప్ర‌తిష్ట‌కు కూడా హ‌జ‌రైన ఈ జంట అక్క‌డ ప్రత్యేక పూజ‌లు కూడా చేశారు. స‌రిగ్గా 13 సంవ‌త్స‌రాల క్రితం కెర‌టం అనే ఓ చిన్న సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ వెంట‌నే వ‌చ్చిన వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ హిట్‌తో స్టార్ హీరోయిన్‌గా ఎదిగి వ‌రుస చిత్రాల‌తో మంచి విజ‌యాలు సాధించింది. ఆ త‌ర్వాత‌ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.

ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో, త‌మిళంలో రెండేసి చొప్పున సినిమాలు చేస్తున్న ర‌కుల్ తెలుగులో మాత్రం ఏ చిత్రానికి సైన్ చేయ‌లేదు.ఇటీవ‌లే ఆమె న‌టించిన అయ‌లాన్ సినిమా త‌మిళ‌నాట విడుద‌లై మంచి విజ‌యం సాధించ‌గా రెండు రోజుల్లో ఓటీటీలకి రానుంది. ఇక ఆమె న‌టించిన మ‌రో త‌మిళ చిత్రం ఇండియ‌న్ 2 వేస‌విలో విడుద‌ల కానుంది.

Updated Date - Feb 01 , 2024 | 12:57 PM