Sonam Bajwa: ఉల్లిపొర డ్రెస్సులో.. మ‌త్తెక్కిస్తున్న పంజాబీ సుంద‌రి

ABN , Publish Date - Feb 07 , 2024 | 03:17 PM

ప్ర‌స్తుతం పంజాబీ చిత్రాలు మాత్ర‌మే చేస్తూ టాప్ హీరోయిన్‌గా, హ‌య్యెస్ట్ పేయిడ్ క‌థానాయిక‌గా రాణిస్తోన్న సోన‌మ్‌ప్రీత్ బ‌జ్వా తాజా ఫొటోలు వైర‌ల్‌గా మారాయి.

Sonam Bajwa: ఉల్లిపొర డ్రెస్సులో.. మ‌త్తెక్కిస్తున్న పంజాబీ సుంద‌రి
sonam

సోన‌మ్‌ప్రీత్ బ‌జ్వా (Sonam Bajwa) అంటే చాలామందికి తెలియ‌క పోవ‌చ్చుగానీ 2016లో విక్ట‌రీ వెంక‌టేశ్ న‌టించిన‌ ‘బాబు బంగారం’ చిత్రంలో దండమే పెట్టుకొంటాం అనే ఓ పాట‌లో.. ఆ త‌ర్వాత సుశాంత్ ‘ఆటాడుకుందాం రా’ సినిమాలో నటించి.. తెలుగు ప్రేక్షకులకు సోన‌మ్ బ‌జ్వా (Sonam Bajwa) ప‌రిచయమైంది.

GFlxndAawAATN49.jpg

మొద‌ట 2014లో మ‌న తెలుగువాడు వైభ‌వ్ న‌టించిన‌ తమిళ సినిమా ‘క‌ప్పాల్‌’తో సినిమాల్లోకి ప్ర‌వేశించిన ఈ ముద్దుగుమ్మ ప్ర‌స్తుతం పంజాబీ చిత్రాలు మాత్ర‌మే చేస్తూ.. టాప్ హీరోయిన్‌గా, హ‌య్యెస్ట్ పేయిడ్ క‌థానాయిక‌గా రాణిస్తోంది.

F6iH8rcacAAfI4h.jpg

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్న‌ది సోన‌మ్ బ‌జ్వా (Sonam Bajwa) నిత్యం హాటుహాటు ఫొటోల‌ను, వీడియోల‌ను అభిమానుల‌తో పంచుకుంటూ కుర్ర‌కారుకు నిద్ర లేకుండా చేస్తోంది. త‌రుచూ బికినీల్లో ద‌ర్శ‌నమిచ్చే ఈ భామ తాజాగా తెల్లటి బికినీ వేసి పైన ఉల్లిపొర లాంటి క్లాత్ ధ‌రించి దిగిన ఫొటోల‌ను సామాజిక మాధ్య‌మాల్లో పోస్టు చేయ‌గా.. క్ష‌ణాల్లోనే ఆ పోస్టు వైర‌ల్ అవుతోంది.

GFpucu-boAAmYqC.jpg


GFU3DdWbMAAkL-R.jpg

అయితే సినిమాల్లో ఇంటిమేట్ స‌న్నివేశాల‌కు, ముద్దు సీన్ల‌కు చాలా దూరంగా ఉండే సోన‌మ్ బ‌జ్వా (Sonam Bajwa) బాలీవుడ్‌తో స‌హా ఇత‌ర భాష‌ల‌ సినిమాలను రిజ‌క్ట్ చేసిన‌ప్ప‌టికీ.. డ్రెస్సుల వ‌ద్దకు వ‌చ్చేస‌రికి నాలా వేరే వాళ్లు ఉండ‌డం అసాధ్యం అన్న రీతిలో అందాల ప్ర‌ద‌ర్శ‌న చేస్తూ.. మీడియా సంస్థ‌ల‌కు స‌రిప‌డా కంటెంట్ ఇస్తుంటుంది. కుర్రాళ్ల మ‌తులు పొగొడుతూ మ‌త్తెక్కిస్తుంటుంది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఫొటోలకు లైకుల మీద లైకులు వచ్చి పడుతున్నాయంటే.. ఆమె ఫాలోయింగ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

GFlxm1UacAA1x3Y.jpg

Updated Date - Feb 07 , 2024 | 03:42 PM