Priya Mani: ఖరీదైన కారు.. ధర ఎంతంటే!

ABN , Publish Date - Feb 24 , 2024 | 08:27 PM

ఎక్స్‌ ప్రెషన్స్ క్వీన్ గా గుర్తింపు పొందిన కథానాయిక ప్రియమణి. కెరీర్‌ బిగినింగ్‌లో వరుసగా చిత్రాలు చేసిన ఆమెకు తర్వాత అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో ఆమె కెరీర్‌ అయిపోయినట్లే అనుకున్నారు.

Priya Mani: ఖరీదైన కారు.. ధర ఎంతంటే!


ఎక్స్‌ ప్రెషన్స్  క్వీన్ గా  గుర్తింపు పొందిన కథానాయిక ప్రియమణి. కెరీర్‌ బిగినింగ్‌లో వరుసగా చిత్రాలు చేసిన ఆమెకు తర్వాత అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో ఆమె కెరీర్‌ అయిపోయినట్లే అనుకున్నారు. 2017లో ముస్తఫారాజ్‌ను వివాహం చేసుకుంది. కొంతగ్యాప్‌ తర్వాత సెకెండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్స్‌ చేసింది. ఫ్యామిలీమ్యాన్  సిరీస్‌తో ఎంట్రీ ఇచ్చింది. దాంతో ఆమె దశ తిరిగింది. వరుసగా అవకాశాలు అందుకొంటూ కథా బలమున్న చిత్రాలతో ముందుకెళ్తుంది.  తాజాగా ఆమె ఖరీదైన కారు కొనుగోలు చేసింది. జర్మన్‌ లగ్జరీ కారు మెర్సిడెజ్‌ బెంజ్‌ జీఎల్‌సీ కొనుగోలు చేసింది. దీని ఽధర రూ.74 లక్షల వరకు ఉంది. ఇప్పటికే కొన్ని కాస్ట్‌ లీ కార్స్‌ ఈమె దగ్గర ఉండగా.. ఇప్పుడీ కారు ప్రియమణి గ్యారేజీలో చేరింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Priya-mani.jpg
ప్రస్తుతం సినిమాలతోపాటు వెబ్‌ సిరీస్‌లతో బిజీగా ఉంది. భామ కలాపం, నెరు, జవాన్, కస్టడీ వంటి చిత్రాల్లో నటించింది. ఆమె నటించిన తాజా చిత్రం 'ఆర్టికల్‌ 370’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పలు టీవీ షోలకు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరిస్తోంది. హిందీ, తమిళ భాషల్లో మరో మూడు చిత్రాలతో బిజీగా ఉంది. 

Updated Date - Feb 24 , 2024 | 08:27 PM