మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hindi Ghajini: ఆమిర్‌ఖాన్ ఈ ప్రాజెక్ట్‌లోకి ఎలా వచ్చారంటే!

ABN, Publish Date - May 19 , 2024 | 08:08 PM

ఆమిర్‌ఖాన్‌ కథానాయకుడిగా బాలీవుడ్‌లో మురగదాస్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘గజనీ’. తమిళంలో సూర్య నటించిన ఈ మూవీని హిందీలోనూ అదే పేరుతో తీసి బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు.

Hindi Ghajini: ఆమిర్‌ఖాన్ ఈ ప్రాజెక్ట్‌లోకి ఎలా వచ్చారంటే!

ఆమిర్‌ఖాన్‌ (Amir khan) కథానాయకుడిగా బాలీవుడ్‌లో మురగదాస్‌ (Murugadoss) దర్శకత్వం వహించిన చిత్రం ‘గజనీ’ (Ghajani) తమిళంలో సూర్య నటించిన ఈ మూవీని హిందీలోనూ అదే పేరుతో తీసి బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు. అంతేకాదు, రూ.100 కోట్లు సాధించిన తొలి బాలీవుడ్‌ సినిమా గానూ ‘గజనీ’ సంచలనం సృష్టించింది. అయితే ఈచిత్రంలో తొలుత కథానాయకుడిగా సల్మాన్‌ ఖాన్‌ను అనుకున్నారట దర్శకుడు మురగదాస్‌. ఇందులో ప్రతినాయకుడిగా నటించిన ప్రదీప్‌ రావత్‌ సూచన మేరకు ఆమిర్‌ను తీసుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని ప్రదీప్‌ రావత్ తెలిపారు.

‘‘గజనీ’ మూవీని హిందీలో చేస్తా’ అని మురగదాస్‌ అంటూ ఉండేవారు. సల్మాన్‌ఖాన్‌ హీరోగా తీయాలన్నది ఆయన ప్లాన్‌. అయితే, అది సరైన ఎంపిక కాదన్నది నా అభిప్రాయం. ఎందుకంటే సల్మాన్‌కు కాస్త కోపం ఎక్కువ. పైగా మురగదాస్‌ హిందీ, ఇంగ్లీష్‌లో మాట్లాడలేరు. పెద్ద పర్సనాలిటీ కూడా కాదు. అప్పటికే నేను ‘సర్పరోష్‌’ వంటి చిత్రాల్లో ఆమిర్‌తో పనిచేసిన అనుభవం ఉంది. ఎప్పుడూ కూల్‌గా ఉండే ఆయన సరైన ఎంపిక అనిపించింది. ఆమిర్‌ఖాన్‌ సెట్స్‌లో అరవడం, కేకలు వేయడం నేనెప్పుడూ చూడలేదు. ఎవరూ అలాంటి ఆరోపణలు చేసిన సందర్భం కూడా లేదు. ప్రతి ఒక్కరితోనూ మర్యాదగా నడుచుకుంటారు. అసభ్య పదజాలం అస్సలు వాడరు. సల్మాన్‌ను ఎంపిక చేసుకుంటే లేనిపోని ఇబ్బందులు వస్తాయి’’ అని మురుగదాస్‌తో చెప్పాను అంటూ ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు మురుగదాస్‌ దర్శకత్వంలో సల్మానఖాన్  'సికిందర్‌' చిత్రం చేస్తున్నారు. సాజిద్‌ నదియాడ్‌వాలా నిర్మాత. ఇందులో రష్మిక కథానాయికగా నటిస్తోంది. 

Updated Date - May 19 , 2024 | 08:24 PM