Poonam Panday - Schbang Agency: అవగాహన కోసమే మేమూ అలా చేశాం! 

ABN , Publish Date - Feb 05 , 2024 | 05:26 PM

గర్భాశయ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకే తాను చనిపోయినట్లు పోస్ట్‌ పెట్టించానంటూ బాలీవుడ్‌ నటి పూనమ్‌ పాండే చేసిన ప్రచారం వివాదానికి దారితీసింది. ఆమెను విమర్శల పాలు చేసింది. దీనిలో భాగమైన డిజిటల్‌ Schbang Agency  క్షమాపణలు చెప్పింది.

Poonam Panday - Schbang Agency:  అవగాహన కోసమే మేమూ అలా చేశాం! 

గర్భాశయ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకే తాను చనిపోయినట్లు పోస్ట్‌ పెట్టించానంటూ బాలీవుడ్‌ నటి పూనమ్‌ పాండే చేసిన ప్రచారం వివాదానికి దారితీసింది. ఆమెను విమర్శల పాలు చేసింది. దీనిలో భాగమైన డిజిటల్‌ Schbang Agency  క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది.

‘సర్వైకల్‌ క్యాన్సర్‌పై అవగాహన కోసం పూనమ్‌ పాండే చేసిన ప్రచారంలో మేమూ  భాగమయ్యాం. జరిగిన పొరపాటుకు  క్షమాపణలు తెలియజేయాలనుకుంటున్నాం. అవగాహన కోసమే మేం అలా వ్యవహరించాం. 2022లో భారత్‌లో 1,23,907 సర్వైకల్‌ క్యాన్సర్‌ కేసులు నమోదు కాగా అందులో 77,348 మరణాలు నమోదయ్యాయి. పూనమ్‌ తల్లి కూడా అదే క్యాన్సర్‌తో పోరాడి మృతి చెందారని చాలామందికి తెలియకపోవచ్చు. తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న విషాదం కారణంగా దీనిని అరికట్టాల్సిన అవసరాన్ని ఉందని ఆమె గుర్తించారు. ఆమె చనిపోయానంటూ చేసిన పోస్ట్‌ వల్లే ఆన్‌లైన్‌లో దీని గురించి లక్షలో సెర్ప్‌ చేశారు’’ అంటూ ఏజెన్సీ ఆ  ప్రకటనలో వివరించారు. గర్భాశయ క్యాన్సర్‌తో వివాదస్పద నటి పూనమ్‌ మృతి చెందిందంటూ ఆమె వ్యక్తిగత ఇనస్టాగ్రామ్‌ ఖాతాలో సిబ్బంది పోస్టు చేయడం ఇండస్ట్రీని షాక్‌కి గురిచేసింది. ఆ మరుసటి రోజే తాను చనిపోలేందంటూ ఓ వీడియో షేర్‌ చేసి మరోసారి షాక్‌ ఇచ్చింది. దీంతో నెటిజన్లు ఆమెపై మండిపడ్డారు. ఇలాంటి ప్రచారం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


Updated Date - Feb 05 , 2024 | 05:27 PM